రుచిని పెంచే పాత్ర!

ఇక్కడి బజార్లలో ఘాటైన మిర్చీపొడులు, జీలకర్రపొడి, మిరియాలు, నువ్వులు, అల్లం, యాలకులపొడి ఏది కావాలన్నా దొరుకుతాయి. అంతెందుకు ఏ దుకాణానికి వెళ్లినా వివిధ పాళ్లలో కలిపిన మొరాకన్‌ స్పైస్‌ మిక్స్‌లు కూడా విరివిగా దొరుకుతాయి.  వివిధ దేశాల నుంచి సుగంధ ద్రవ్యాలని దిగుమతి చేసుకుని

Published : 21 Aug 2022 01:31 IST

మసాలాలు వేసి దట్టించి చేసే వంటకాలు అనగానే మనకు ఠక్కున భారతీయ వంటకాలే గుర్తుకొస్తాయి. కానీ మనకంటే ఎక్కువగా మసాలాల్ని వాడుతూ వంటలు చేసే మరో క్యుజీన్‌ కూడా ఉంది. అదే మొరాకన్‌ క్యుజీన్‌..  

ఇక్కడి బజార్లలో ఘాటైన మిర్చీపొడులు, జీలకర్రపొడి, మిరియాలు, నువ్వులు, అల్లం, యాలకులపొడి ఏది కావాలన్నా దొరుకుతాయి. అంతెందుకు ఏ దుకాణానికి వెళ్లినా వివిధ పాళ్లలో కలిపిన మొరాకన్‌ స్పైస్‌ మిక్స్‌లు కూడా విరివిగా దొరుకుతాయి.  వివిధ దేశాల నుంచి సుగంధ ద్రవ్యాలని దిగుమతి చేసుకుని మరీ ఈ స్పైస్‌ మిక్స్‌లు చేస్తుంటారు. అందుకే ఇక్కడ భిన్నమైన మాసాలా మిక్స్‌లు దొరుకుతాయి. వీళ్ల జాతీయ వంటకం పేరు కొయిష్‌కొయిస్‌. గోధుమరవ్వతో చేసిన ఈ వంటకాన్ని ఉడికించి కాయగూరలతో, ఆకుకూరలతో మనం అన్నం తిన్నట్టుగా తింటారు. టాజిన్‌.. ఇది ప్రపంచం మొత్తానికి తెలిసిన పాపులర్‌ మొరాకన్‌ వంట. చికెన్‌ లేదా లేత గొర్రె మాంసాన్ని వివిధ రకాల కాయగూరలు, డ్రైనట్స్‌, సుగంధద్రవ్యాలు వేసి ఒక కోన్‌లాంటి మట్టి పాత్రల్లో ఉంచి వండుతారు. దినుసుల్లోని సువాసన ఎక్కడికీ పోకుండా ఉండేందుకు ఈ పాత్ర ఆకృతి ఉపకరిస్తుంది. మట్టి పాత్ర కాబట్టి రుచిని పెంచుతుంది. ఈ టాజిన్‌ పాత్రలు మనకు కూడా వివిధ రకాల డిజైన్లలో ఆన్‌లైన్‌లో దొరుకుతాయి. హరీరాసూప్‌... టొమాటోలు, సెనగలు వేసి చేసే ఈ సూప్‌ చాలా బలవర్థకంగా ఉంటుంది. అందుకే దానిని రంజాన్‌ మాసంలో ఉదయం పూట తాగుతుంటారు. ఇవీ మొరాకన్‌ క్యుజీన్‌ విశేషాలు.


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని