పీతల కూర తేలికే!
ఇప్పుడు సూపర్‌మార్కెట్లో, చేపల మార్కెట్లో ... చేపల మాదిరిగానే పీతలు కూడా తేలిగ్గా దొరుకుతున్నాయి. కొన్ని చోట్ల అయితే వండుకోవడానికి వీలుగా శుభ్రం చేసి ఇస్తున్నారు.
ప్ర & జ
మావారికి పీతల కూర అంటే చాలా ఇష్టం. కానీ సిటీలో వాటిని తెచ్చి, వండటం ఎలానో నాకు తెలియడం లేదు? వీటిలో తాజా వాటిని గుర్తించడం ఎలా?
రమ్య, హైదరాబాద్.
ఇప్పుడు సూపర్‌మార్కెట్లో, చేపల మార్కెట్లో ... చేపల మాదిరిగానే పీతలు కూడా తేలిగ్గా దొరుకుతున్నాయి. కొన్ని చోట్ల అయితే వండుకోవడానికి వీలుగా శుభ్రం చేసి ఇస్తున్నారు. కాబట్టి మీకు వాటిని ఎలా శుభ్రం చేసుకోవాలన్న బాధ ఉండదు. ఇక వాటిని వండే విషయానికొస్తే... పెద్దగా మసాలాల అవసరం కూడా ఉండదు. జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, వెల్లుల్లి, గరంమసాలా, ధనియాలపొడి ఉంటే చాలు. అచ్చంగా చేపలు మాదిరిగానే తేలిగ్గా వండుకోవచ్చు. ఇవి వండటానికి ఇరవై నిమిషాలకు మించి సమయం పట్టదు. ఇక తాజావి ఎలా ఎంచుకోవాలంటే... కొనేటప్పుడు వీటి మాంసం గట్టిగా ఉండాలి. అలా ఉంటే అవి తాజాగా ఉన్నట్టు లెక్క. మెత్తగా ఉండి, దుర్వాసన వస్తుంటే పాడయినట్టే. మరీ పెద్ద పీతలని కొనొద్దు. ఎందుకంటే అవి చప్పగా ఉంటాయి. రుచిగా ఉండవు. అలాగే నీటిలో పెట్టి ఉంచిన వాటికన్నా... బయట పెట్టి అమ్మినవే రుచిగా ఉంటాయి. పైగా నీటిలో ఉంచిన పీతలు బరువు ఎక్కువ ఉండి ధర ఎక్కువ చెల్లించాలి. ఇక చాలామంది పీతల్లో రొయ్యల్లో మాదిరిగానే కొవ్వు ఎక్కువేమో అన్న భావన ఉంటుంది. కానీ నిజం కాదు. వీటిల్లో గుండెకు మేలు చేసే ఒమెగా ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. గుండెజబ్బులు ఉన్నవాళ్లకి మంచిది. రక్తహీనత రాకుండా ఉంటుంది. పౌర్ణమి, అమావాస్య రోజుల్లో అమ్మే పీతలు రుచిగా ఉంటాయి. ఇక ఎర్రగా ఉండే వాటికన్నా బూడిద, నలుపురంగుల్లోని పీతలు రుచిగా ఉంటాయి. ఈ చలికాలంలో మిరియాలపొడి వేసి పీతల పులుసు చేస్తే జలుబు, దగ్గు వంటివి బలాదూర్ అవుతాయి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Chatrapati Shivaji: 350 ఏళ్ల తర్వాత భారత్‌కు చేరనున్న ఛత్రపతి శివాజీ ఆయుధం
-
Kuppam: చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ కుప్పంలో భారీ ర్యాలీ
-
LPG prices: వాణిజ్య గ్యాస్ సిలిండర్‌పై భారం.. రూ.209 పెంపు
-
ODI WC 2023: ఈ తరం అత్యుత్తమ క్రికెటర్ అతడే.. మరెవరూ పోటీలేరు: యువరాజ్ సింగ్
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Gautham Menon: ‘లియో’.. మైండ్ బ్లోయింగ్ మూవీ: గౌతమ్ మేనన్