సగ్గుబియ్యం వడలు

సగ్గుబియ్యం వడలు కావల్సినవి: నానబెట్టిన సగ్గుబియ్యం- కప్పు, బంగాళదుంపలు- పెద్దది ఒకటి, నూనె, ఉప్పు- తగినంత, సన్నగా తరిగిన పచ్చిమిర్చి- రెండు చెంచాలు, వేయించి పొట్టు తీసిన పల్లీలు...

Published : 21 Jan 2018 01:28 IST

ఫటాఫట్‌
సగ్గుబియ్యం వడలు

కావల్సినవి: నానబెట్టిన సగ్గుబియ్యం- కప్పు, బంగాళదుంపలు- పెద్దది ఒకటి, నూనె, ఉప్పు- తగినంత, సన్నగా తరిగిన పచ్చిమిర్చి- రెండు చెంచాలు, వేయించి పొట్టు తీసిన పల్లీలు- రెండు చెంచాలు, కొత్తిమీర తరుగు- తగినంత, సన్నగా తరిగిన అల్లంముక్కలు- చెంచా
తయారి: సగ్గుబియ్యంలో ఉడికించిన బంగాళదుంపల్ని మెత్తగా చిదిమి వేసుకోవాలి. అలాగే అల్లం, మిర్చి, జీలకర్ర, పల్లీలు, కొత్తిమీర, ఉప్పు వేసి కలిపి వడల్లా నూనెలో వేసి వేయించుకోవడమే. ఉపవాస వేళల్లో తింటే తక్షణశక్తి లభిస్తుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని