రవీంద్రుడు మెచ్చిన వడియాలు

వాకిట్లో ముగ్గులు వేయడం గురించి తెలుసు. కానీ తినే ముగ్గులు గురించి ఎప్పుడైనా విన్నారా? పశ్చిమబెంగాల్‌లోని మిడ్నాపూర్‌ మహిళలు తయారుచేసే గొయనాబోరీ వడియాలు అందమైన ముగ్గుల్లానే ఉంటాయి. వంట చేయడాన్ని చక్కని కళగా చెప్పుకొంటాం కానీ వీళ్లు కళాత్మకతనంతా

Updated : 17 Jul 2022 06:40 IST

వాకిట్లో ముగ్గులు వేయడం గురించి తెలుసు. కానీ తినే ముగ్గులు గురించి ఎప్పుడైనా విన్నారా? పశ్చిమబెంగాల్‌లోని మిడ్నాపూర్‌ మహిళలు తయారుచేసే గొయనాబోరీ వడియాలు అందమైన ముగ్గుల్లానే ఉంటాయి. వంట చేయడాన్ని చక్కని కళగా చెప్పుకొంటాం కానీ వీళ్లు కళాత్మకతనంతా ఒక చోట పోగేసి ఈ గొయానాబోరీ వడియాలు తయారు చేస్తుంటారు. అందుకే ఇవి అంత ప్రత్యేకం. కొత్తపంట చేతికి రాగానే ఆ బియ్యాన్ని రోళ్లలో దంచి ఈ వడియాలు పెడతారు. ఓ పళ్లెం నిండుగా గసగసాలు వేసి...వాటిపై జిలేబీల మాదిరిగా డిజైన్లు వేసి అందమైన ఈ గొయానాబోరీలను చేస్తారు. తర్వాత వీటిని ఎండ బెడతారు. ఇలా వర్షాలు జోరుగా పడే సమయంలో వాటిని వేయించుకుని తింటారు. ఒకప్పుడైతే ఆడపిల్లలకి సారెలో ఇవి లేకుండా అత్తారింటికి పంపించేవారు కాదు. తర్వాతికాలంలో ఈ కళ అంతరించిపోయింది. దాంతో రవీంద్రనాథ్‌ఠాగూర్‌ లాంటివాళ్లు కూడా పూనుకుని ఈ పాకకళపై అవగాహన తీసుకురావడంతో ఈ కళ ఇప్పటికీ బతికి ఉంది.  ఈ మధ్యకాలంలో కూడా కొన్ని సంస్థలు వర్క్‌ షాపులు పెట్టి మరీ ఈ కళని బతికిస్తున్నాయి. యూట్యూబర్లు, ఫుడ్‌బ్లాగర్‌లు వచ్చాక.. గొయానాబోరీతోపాటు నక్షాపిఠా వంటి ఇతర బెంగాలీ వంటకాలకు కూడా ప్రాధాన్యం పెరుగుతూ వచ్చింది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని