దాల్‌మఖని వేగంగా అవ్వాలంటే..

హోటల్‌లో దాల్‌మఖనీ అంటే చాలా ఇష్టం. ఇంట్లో బాగానే చేస్తున్నా కానీ... ఎక్కువ సమయం తీసుకుంటుంది.

Published : 15 Jan 2023 00:51 IST

హోటల్‌లో దాల్‌మఖనీ అంటే చాలా ఇష్టం. ఇంట్లో బాగానే చేస్తున్నా కానీ... ఎక్కువ సమయం తీసుకుంటుంది. త్వరగా అవ్వాలంటే ఏవైనా చిట్కాలుంటే చెప్పండి?

అలేఖ్య, బెంగళూరు

దాల్‌మఖనీలో ప్రధానంగా ఉపయోగించేవి నల్ల మినుములు అంటే పొట్టుతీయని మినుములు, రాజ్మా బీన్స్‌. వీటిని నేరుగా ఉడికిస్తే చాలా సమయం పడుతుంది. అలా కాకుండా కనీసం తొమ్మిది గంటలన్నా నానబెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల కూర త్వరగా ఉడుకుతుంది. గ్యాస్‌, సమయం రెండూ ఆదా అవుతాయి. అంతకు మించి అజీర్తి సమస్యలూ రావు. గ్యాస్‌ సమస్య ఉండదు. రెండుమూడు సార్లు కడిగి ఆ తర్వాత మంచి నీళ్లలో ఉడికించుకోవాలి. అలాగే పాత మినుములు, బీన్స్‌ని ఎంచుకోవద్దు. పాతవి ఉడకడానికి చాలా సమయం పడుతుంది. ఈ వంటకంలో మరో ముఖ్యమైన పదార్థం టొమాటోలు. ఇవి బాగా పండినవి లేదా వాడకానికి సిద్ధంగా ఉండే టొమాటో ప్యూరీని వేసి చూడండి. సమయం తగ్గడమే కాదు.. కూర చూడ్డానికి బాగుంటుంది. చివరిగా ధుంగార్‌ పద్ధతిలో బొగ్గుని కాల్చి ఆ పొగను చూపిస్తే కూరకి హోటల్‌ స్టైల్‌లో స్మోక్‌ ఎఫెక్ట్‌ వస్తుంది.
అవినాష్‌, చెఫ్‌, ఏషియన్‌ సినిమాస్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు