Published : 05 Mar 2023 00:28 IST

అతను రాగి టీ చేస్తే...

బ్లాక్‌టీ, గ్రీన్‌టీ.. వైట్‌టీ ఇలా చాలా రకాల చాయ్‌లు తెలుసుంటాయి మీకు. కానీ రాగి టీ గురించి ఎప్పుడైనా విన్నారా? ఆ టీ గురించి తెలుసుకోవడానికి ముందు జగన్నాథ్‌ చిన్నేరి గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే...  

గన్నాథ్‌ చిన్నేరిని టీ మాన్‌ ఆఫ్‌ ఒడిశా అని ముద్దుగా పిలుచుకుంటారు భోజనప్రియులు. కారణం అతను చేసే వినూత్నమైన చాయ్‌లే. ముఖ్యంగా అతను చేసే రాగి టీనే అతనికి అంత పేరు తెచ్చింది. కోరాపుట్‌ జిల్లాలోని జయపుర ఇతని స్వస్థలం. మొదట్లో మిల్లెట్‌ హబ్‌ పేరుతో చిరుధాన్యాలపై అవగాహన తీసుకొచ్చేవారీయన. ఆ క్రమంలోనే అతని దృష్టి రాగులపై పడింది. వాటితో టీ చేస్తే అది అనుకున్నంత రుచిగా రాలేదు. జావకీ దానికీ తేడా ఉండేది కాదు. అలా కాకుండా స్థానిక గిరిజనులు తయారుచేసే వంటకాలని పరిశీలించి బెల్లం, ఎండబెట్టిన రాగులు, మరికొన్ని ఔషధాలు కలిపి అతను చేసిన చాయ్‌కి మంచి పేరువచ్చింది. దీనిని అందరికీ పరిచయం చేయడానికి రెండేళ్లు పట్టింది. ఇప్పుడు మాత్రం బోలెడు డిమాండ్‌. రోజుకి ఎంత లేదన్నా రెండొందల కప్పులు తేలిగ్గా అమ్ముడుపోతాయట.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని