కెనడాలో పుటిన్‌!

కెనడాలో పుటిన్‌ ఏంటి అనుకుంటున్నారా? ఒక్కోదేశంలో ఒక్కో వంటకం ప్రాచుర్యంలో ఉంటుంది కదా! అలా కెనడాలో పుటిన్‌ వంటకానికి ఎక్కడలేని డిమాండూ ఉంది.

Published : 16 Apr 2023 00:08 IST

కెనడాలో పుటిన్‌ ఏంటి అనుకుంటున్నారా? ఒక్కోదేశంలో ఒక్కో వంటకం ప్రాచుర్యంలో ఉంటుంది కదా! అలా కెనడాలో పుటిన్‌ వంటకానికి ఎక్కడలేని డిమాండూ ఉంది. దీని అసలు పేరు పౌటిన్‌ అయినా చాలామంది దీనిని పుటిన్‌ అనీ, పుతిన్‌ అనే పిలుస్తారు. రెస్టరంట్‌, పబ్‌, వీధిచివర దుకాణం ఇలా ఎక్కడైనా సరే మనకి ముందుగా పరిచయమయ్యే వంటకం ఇదే. కరకరలాడే ఫ్రైంచ్‌ఫ్రైస్‌... వాటిపై తెల్లని చీజ్‌ ముక్కలు, ఆపై గ్రేవీ. ఇదే పుటిన్‌ వంటకం. ఏటా కెనడాలో పుటిన్‌ ఎవరు ఎక్కువ తింటారనే పోటీలు నిర్వహిస్తారు. వీటిల్లో కెనడియన్ల కన్నా అమెరికన్లే ఎక్కువగా విజేతలవుతుంటారు. ఎందుకంటే దీని రుచి ఇప్పుడు ప్రపంచవ్యాప్తం అవుతోంది మరి. పిజా, బర్గర్ల మాదిరిగానే ఈ వంటకానికి పేరు రావడంతో... మెక్‌డోనాల్డ్స్‌కూడా అన్ని దేశాల్లోనూ ఈ వంటకాన్ని అందించడం మొదలుపెట్టింది. వాస్తవానికి ఈ వంటకం... అనుకోకుండా తయారైంది. ఫ్రెంచ్‌ఫ్రైస్‌ కోసం రెస్టరంట్‌కి వచ్చిన ఒకాయనకి కెచప్‌ లేకపోవడంతో చీజ్‌ వేసి వడ్డించాల్సి వచ్చింది. ఆపై ప్రత్యేకమైన గ్రేవీ వేసి చేసిన వంటకాన్ని అతను ‘ఏంటి ఈ గజిబిజి వంటకం’ అని తిట్టుకున్నా రుచిగా ఉండటంతో తినేశాడు. ఫ్రెంచ్‌లో గజిబిజి వంటకం అనేదాన్ని పుటిన్‌ అంటారట. అలా వచ్చిన పేరది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు