గోదారోళ్ల చిరుతిండి చిక్కుడు చిక్కీ!

పల్లీ చిక్కీ, నువ్వుల చిక్కీ లాంటివి అందరికీ తెలుసు. కానీ చిక్కుడు గింజలతో కూడా చిక్కీ చేస్తారని మీకు తెలుసా? ఇది గోదారోళ్ల వంటకం.

Updated : 01 Oct 2023 05:22 IST

ల్లీ చిక్కీ, నువ్వుల చిక్కీ లాంటివి అందరికీ తెలుసు. కానీ చిక్కుడు గింజలతో కూడా చిక్కీ చేస్తారని మీకు తెలుసా? ఇది గోదారోళ్ల వంటకం. ఈ జిల్లాల్లో కూడా ఈ తరం వాళ్లకి అంతగా తెలియదు. మొదటిసారి దాని గురించి విన్నప్పుడు.. చిక్కుడు గింజలతో చిక్కీనా?అదేం బాగుంటుంది- అనిపించింది. తీరా మా నాన్నమ్మ చేశాక.. ఆశ్చర్యపోయా! ఆ రుచి మామూలుగా లేదు.  

చిక్కుడు చిక్కీ ఎలా చేస్తారో చెప్పనా.. గోదావరి జిల్ల్లాల్లో దేశవాళీ చిక్కుడు పాదులు ఉంటాయి. కాయలు ముదిరిన తర్వాత కోసి, గింజలు తీస్తారు. ఇవి సోయాబీన్స్‌లానే ఉంటాయి. ఈ చిక్కుడు గింజల్ని ముందు నానబెట్టి, ఆనక ఎండబెట్టి పొట్టు తీయాలి. బెల్లం ముదురు పాకం పట్టి, అందులో దోరగా వేయించిన చిక్కుడు పప్పు, కాస్త యాలకుల పొడి వేసి కలపాలి. ఒక పళ్లెంలో కాస్త నెయ్యి రాసి, చిక్కుడు పాకాన్ని సమంగా సర్ది, ముక్కలుగా కట్‌ చేయాలి. కప్పు గింజలకు కప్పున్నర బెల్లం పడుతుంది. ఇది రుచికి రుచి, పోషకాలు మెండు. పిల్లలు ఇష్టంగా తినే ఈ చిరుతిండి- బాలింతలు, గర్భిణులకూ చాలా మంచిది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఎముకలను దృఢంగా చేస్తుంది. నడుమునొప్పి తగ్గిస్తుంది. హృద్రోగాలు, క్యాన్సర్లను కూడా నిరోధిస్తుంది. ఊబకాయం రాదు. ఎంత మంచిదో కదా! నచ్చితే మీరూ ప్రయత్నించండి.

 పట్టపు దేవి, కాకినాడ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని