అప్పం.. చేసేద్దాం.. తినేద్దాం..

కేరళ వాసులు తరచుగా చేసుకునే వంటల్లో అప్పం ఒకటి. చూస్తుంటేనే తినేయాలనిపించేంతగా నోరూరుతుంది.

Published : 19 Nov 2023 00:43 IST

కేరళ వాసులు తరచుగా చేసుకునే వంటల్లో అప్పం ఒకటి. చూస్తుంటేనే తినేయాలనిపించేంతగా నోరూరుతుంది. వీటిని ఎలా చేయాలంటే.. రెండు కప్పుల బియ్యాన్ని కడిగి, మూడు గంటలు నానబెట్టాలి. ఆ నీళ్లు తీసేసి, కప్పు నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్‌ చేయాలి. పిండిని జార్‌ లోంచి తీసి, మరో పాత్రలో వేసి, రెండు కప్పుల నీళ్లు పోసి కలిపి, గట్టిగా అయ్యేవరకూ ఉడికించాలి. అందులో కప్పు కొబ్బరి తురుము, కప్పు నీళ్లు పోసి కలపాలి. చల్లారిన తర్వాత.. రెండు చెంచాల ఉప్పు, బేకింగ్‌ సోడా, పంచదార అర చెంచా చొప్పున వేసి కలపాలి. కడాయిలో దోశలా వేసి, మూత పెట్టాలి. ఒక నిమిషం ఉంచి, తీసేస్తే సరిపోతుంది. రెండోవైపు కాల్చనవసరం లేదు. ఈ అప్పం ఎంత రుచిగా ఉంటుందో.. అంత ఆరోగ్యకరం కూడా. వీటిల్లో కాపర్‌, ఐరన్‌, మాంగనీస్‌, బి-విటమిన్లు ఉన్నాయి. ఎర్ర రక్తకణాలు వృద్ధి చెందడం, రోగనిరోధక శక్తి పెరగటం లాంటి ప్రయోజనాలున్నాయి. ఇవి తేలిగ్గా అరుగుతాయి, గ్యాస్ట్రిక్‌ సమస్య, ఎసిడిటీ, మలబద్ధకం లాంటి సమస్యలు తలెత్తవు. అప్పాలను అలాగే తినొచ్చు. లేదంటే కొబ్బరి పాలు, కొబ్బరి పచ్చడి, కూర, సాంబారులతోనూ తినొచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు