పీనట్‌ బటర్‌ ఇంట్లోనే..

డైట్‌లో ప్రొటీన్‌కుండే విలువ తెలిసిందే. ప్రొటీన్లని పుష్కలంగా అందించే పీనట్‌ బటర్‌ని చాలామంది బయటేకొంటూ ఉంటాం. కానీ వాటిల్లో నిల్వ కారకాలనీ, చక్కెర్లని వాడతారు.

Updated : 11 Dec 2022 00:56 IST

డైట్‌లో ప్రొటీన్‌కుండే విలువ తెలిసిందే. ప్రొటీన్లని పుష్కలంగా అందించే పీనట్‌ బటర్‌ని చాలామంది బయటేకొంటూ ఉంటాం. కానీ వాటిల్లో నిల్వ కారకాలనీ, చక్కెర్లని వాడతారు. అలా కాకుండా ఇంట్లోనే చేసుకుందాం అనుకుంటున్నారా? అయితే ఈ పీనట్‌బటర్‌ మేకర్‌ని తెచ్చుకోండి. దీనిని ఉపయోగించుకోవడం చాలా తేలిక. పైనున్న జార్‌లో పల్లీలను, పంచదారకి బదులుగా తేనె లేదా ఖర్జూరం వంటి ప్రత్యామ్నాయాలను వేసుకోవచ్చు. స్విచ్‌ ఆన్‌ చేసి మీ పని మీరు చేసుకోండి. అదే పీనట్‌ బటర్‌ని తయారుచేస్తుంది. బజారులో దొరికే తరహాలోనే ఈ బటర్‌ కూడా ఉంటుంది. దీనిని శుభ్రం పరుచుకోవడం కూడా చాలా తేలిక.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని