వేసవిలో.. చల్లదనాన్నిస్తాయి!

వేసవికాలం వస్తుందంటే వేడి దెబ్బని తట్టుకోవడానికి సబ్జా గింజలు ఎక్కడున్నాయా అని వెతుకుతాం. అనేక సమస్యల నుంచి ఉపశమనం కలిగించే ఈ గింజలు ఎలాంటి పోషకాలని కలిగిఉన్నాయో చూద్దాం..

Published : 12 Feb 2023 00:40 IST

వేసవికాలం వస్తుందంటే వేడి దెబ్బని తట్టుకోవడానికి సబ్జా గింజలు ఎక్కడున్నాయా అని వెతుకుతాం. అనేక సమస్యల నుంచి ఉపశమనం కలిగించే ఈ గింజలు ఎలాంటి పోషకాలని కలిగిఉన్నాయో చూద్దాం..

* ప్రొటీన్లు, మంచి కొవ్వులకు ఈ సబ్జాగింజలు పెట్టింది పేరు. పీచు, ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలుండే ఈ గింజలని తీసుకుంటే.. ఎండ తాకిడి నుంచి బ్రహ్మాండమైన ఉపశమనం కలిగిస్తాయి.

* పీచు ఎక్కువగా ఉండే ఈ గింజలు మధుమేహం ఉన్నవారికి ఒక్క సారిగా చక్కెరస్థాయిలు పెరగకుండా చేసి నిదానంగా జీర్ణమవుతాయి. మలబద్ధకం వంటి సమస్యలతో బాధపడేవారు ఈ గింజలని రోజూ తీసుకుంటే మంచిది.

* ఈ గింజల్ని తిన్నప్పుడు కడుపు నిండిన భావన కలుగుతుంది. దాంతో ఇంకేవో చిరుతిళ్లు తినాలనే భావన ఉండదు. దానివల్ల బరువు అదుపులో ఉంటుంది.  

* సబ్జా గింజలతో చేసిన స్మూథీలు తాగడం వల్ల రక్తహీనతను నివారించొచ్చు. కారణం ఐరన్‌, క్యాల్షియం, మెగ్నీషియం మెండుగా ఉంటాయి. ఎముకలు బలంగా మారతాయి.

* ఈ గింజల్లో యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ వైరల్‌, యాంటీ ఫంగల్‌ గుణాలు అధికం. నోటిలో పుళ్లు, అల్సర్లు ఉన్నవారికి ఇది మంచి మందు. నోటి దుర్వాసనని తగ్గిస్తాయి. దంతక్షయాన్ని నివారిస్తాయి. క్యాన్సర్‌ని నివారించే గుణాలూ అధికమే.

* అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడేవారు... సబ్జాగింజలతో చేసిన జావ, స్మూథీలు తాగితే ఫలితం ఉంటుంది.

* అయితే ఈ గింజలని రోజుకి రెండు చెంచాలకి మించి తినడం మంచిదికాదు. వికారం, వాంతులు, ముఖంపై మొటిమలు, యాక్నె వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. గర్భిణులు వైద్యుల సలహామేరకే తీసుకోవాల్సి ఉంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని