స్టంట్‌ చేస్తూ కిందపడ్డ రజినీ డూప్‌ 

రజినీకాంత్‌కు భారతదేశంతో పాటు విదేశాల్లో కూడా అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా

Published : 09 Jul 2021 22:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌:  రజినీకాంత్‌ తనదైన స్టైల్‌తో భారతదేశంతో పాటు విదేశాల్లో కూడా అభిమానులను సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఏడు పదుల వయస్సులో కూడా సినిమాల్లో నటిస్తూ ఎంతగానో అలరిస్తున్నారు. కాగా రజినీకాంత్‌కి ఉన్న క్రేజ్‌ వల్ల ఆయన పోలికలతో ఉన్నవాళ్లు కూడా పాపులర్‌ అవుతున్నారు.

రజినీకాంత్‌లా కనిపించే ఓ వ్యక్తి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నాడు. ఓ కార్యక్రమంలో సదరు వ్యక్తి రజినీకాంత్‌ స్టైల్‌లో స్టంట్‌ చేయడానికి ప్రయత్నించాడు. స్టంట్‌లో భాగంగా కుర్చీని బలంగా తన్నాడు. దాంతో కుర్చీలో కాలు ఇరుక్కుని కింద పడిపోయాడు. ఆద్యంతం నవ్వులు పూయిస్తున్న ఈ వీడియోను నిరంజన్‌ అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకోగా అది కాస్తా  సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని