Viral video: ఇది భూలోకమా? లేక స్వర్గలోకమా?.. మంత్రముగ్ధుల్ని చేస్తున్న వీడియో

‘కళ్లు చిన్నగా ఉంటే ప్రయోజనాలు ఇవీ’, ‘అసలు పెళ్లెందుకు చేసుకోవాలి’ అంటూ తనదైన శైలిలో కామెడీ పండించే నాగాలాండ్‌ విద్యాశాఖ మంత్రి తెమ్జెన్‌ ఇన్మా........

Published : 26 Jul 2022 17:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘కళ్లు చిన్నగా ఉంటే ప్రయోజనాలు ఇవీ’, ‘అసలు పెళ్లెందుకు చేసుకోవాలి’ అంటూ తనదైన శైలిలో కామెడీ పండించే నాగాలాండ్‌ విద్యాశాఖ మంత్రి తెమ్జెన్‌ ఇన్మా.. తాజాగా ఓ వీడియోను ట్విటర్‌లో పంచుకున్నారు. ఆ క్లిప్పింగ్‌ను చూసిన నెటిజన్లంతా మంత్రముగ్ధులవుతున్నారు. ఇది భూలోకమా? లేక స్వర్గలోకమా అంటూ ఆశ్చర్యపోతున్నారు. అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న వ్యాలీని పాల నురగల్లాంటి మేఘాలు ఒక్కసారిగా కమ్మేయడం, మేఘాలు ఉద్ధృతంగా ప్రయాణిస్తూ వ్యాలీని దాటుకుంటూ వెళ్లడం ఆ వీడియోలో కనిపిస్తుంది. ఇన్మా ఈ వీడియోను పంచుకుంటూ.. ఈ దృశ్యాలు అందంగా లేవా? ఈ ప్రాంతాన్ని గుర్తించండి అంటూ పేర్కొన్నారు.

మంత్రి అడిగిన ప్రశ్నకు విశేష స్పందన లభిస్తోంది. నెటిజన్లు కామెంట్ల రూపంలో తమ సమాధానాలను తెలియజేస్తున్నారు. అయితే అనేక మంది ఆ ప్రాంతాన్ని గుర్తిస్తూ.. ‘కోహిమా’ అంటూ సమాధానమిస్తున్నారు. ‘ఇది భూలోకమా? లేక స్వర్గలోకమా?’ అంటూ మరికొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ వీడియోను 2.18లక్షల మందికి పైగా వీక్షించారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఇంకా ఎన్నో అద్భుత ప్రదేశాలున్నాయని, ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా మరింత అభివృద్ధి పరచాలని కొందరు నెటిజన్లు పేర్కొంటున్నారు.






గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని