Viral: పాక్కుంటూ పైకెళ్లి.. అడ్డంగా బుక్కయ్యాడు!
విద్యుత్ చౌర్యానికి పాల్పడుతూ అధికారుల నుంచి తప్పించుకునేందుకు ఓ వ్యక్తి చేసిన ఫీట్లకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో నవ్వులు పూయిస్తోంది....
గజియాబాద్: విద్యుత్ చౌర్యానికి పాల్పడుతూ అధికారుల నుంచి తప్పించుకునేందుకు ఓ వ్యక్తి చేసిన ఫీట్లకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో నవ్వులు పూయిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని గజియాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి అక్రమ కనెక్షన్‌తో విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నట్లు అధికారులకు సమాచారం అందింది. దీంతో అతడి ఇంట్లో సోదాలు జరిపేందుకు అధికారులు ఆ ఇంటివద్దకు చేరుకున్నారు. వారిని గమనించిన సదరు వ్యక్తి.. అధికారులు రాకముందే ఆ కనెక్షన్‌ను ఎలాగైనా తొలగించాలని పాక్కుంటూ ఇంటి మిద్దె మీదకు చేరుకుంటాడు. కనెక్షన్‌ను తొలగించేందుకు ప్రయత్నిస్తుంటాడు. అయితే అప్పటికే మరో ఇంటి మిద్దె మీదకు చేరుకున్న ఓ అధికారి సదరు వ్యక్తి చేస్తున్న తతంగాన్నంతా సెల్ఫోన్లో రికార్డు చేస్తూ.. ‘బ్రదర్ నేనిక్కడే ఉన్నా’ అని చెప్పడంతో ఆ అధికారిని చూసి కంగుతిన్నాడు. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడటంతో తెల్లమొహం వేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను ఇప్పటివరకు 2.20 లక్షల మంది చూశారు. అనేక మంది ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘అమ్ముడుపోయే’ ఎమ్మెల్యేలు ప్రజా ద్రోహులు : హిమాచల్ సీఎం
-
గుడ్‌న్యూస్ చెప్పిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ టీమ్.. అది ఏంటంటే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
-
రైతు భరోసా నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
-
టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. మాకు ముందే తెలుసంటూ నెటిజన్స్ ట్రోల్స్!