రీఛార్జ్‌ హేమకి.. ఏటీఎం హేమంత్‌

హేమా.. పగటిపూట చంద్రుడు, రాత్రిపూట సూర్యుడు కనిపించకపోయినా నువ్వు మాత్రం నాకు పగలూరాత్రీ చుక్కలు చూపిస్తున్నావ్‌. బస్‌ ఛార్జీలు పెరిగితే భరించా...

Updated : 09 Dec 2022 12:58 IST

హేమా..
పగటిపూట చంద్రుడు, రాత్రిపూట సూర్యుడు కనిపించకపోయినా నువ్వు మాత్రం నాకు పగలూరాత్రీ చుక్కలు చూపిస్తున్నావ్‌. బస్‌ ఛార్జీలు పెరిగితే భరించా. రైల్వేఛార్జీలు పెంచితే సహించా. కరెంటు ఛార్జీలతో కష్టమైనా సహకరించా. కానీ నీకు రీఛార్జీలు చేయించలేక నిర్జీవుడినయ్యా. చెప్పాలంటే నేను చేసే పనికన్నా నీకు రీఛార్జీ చేయించే డ్యూటీనే ఎక్కువైంది. నువ్వు వేసే ఆర్డర్లతో నా ఆంధ్రాబ్యాంకు ఏటీమ్‌ కార్డు అరిగిపోయింది. ఎస్బీహెచ్‌ కార్డు విరిగిపోయింది. అయోమయంలో ఏదేదో నొక్కేసరికి ఇంగ్‌వైశ్యా బ్యాంక్‌ కార్డు లాక్‌ అయ్యింది. ఈ బాధలో నేనుంటే ఉదయం టెలినార్‌కి, మధ్యాహ్నం వొడాఫోన్‌కి, రాత్రుళ్లు ఎయిర్‌టెల్‌కి, ఆదివారాలు ఐడియాకి, పండగలకి బీఎస్‌ఎన్‌ఎల్‌కి రీఛార్జీ చేయమని కండీషన్లు పెడుతున్నావ్‌. ఈ చిరాకులో నీపై ఉన్న లవ్‌ ఛార్జింగ్‌ డౌన్‌ అయ్యేలోపే నాపై నీ ఫీలింగ్‌ ఏంటో తెలియజెయ్యి. లేదంటే నీ సెల్‌ ఛార్జింగ్‌ చేయడం ఆపేసి వాల్‌ దూకి నేరుగా మీ ఇంట్లో వాలిపోతా.

ఇట్లు
చెడిపోయిన ఏటీఎం కార్డుల హేమంత్‌
- నల్లపాటి సురేంద్ర, కొత్తగాజువాక


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని