Published : 09 Oct 2021 01:23 IST

మీ రాశి.. మీ స్టైల్‌!

స్టైల్‌పై మోజున్న అమ్మాయి మోడల్‌లా ముస్తాబవుతుంది. అందర్నీ ఆకట్టుకోవాలనుకునే కుర్రాడు హీరోలా షోకులు చేసుకుంటాడు. అంతేగా! అంటే.. అంతేకాదండోయ్‌.. వాళ్ల జన్మరాశుల ప్భావంతోనే జనం వస్త్రధారణపై దృష్టి పెడతారనీ, అందంగా అలంకరించుకుంటారనీ చెబుతారు జాతకరాయుళ్లు. ‘అబ్బే.. మేం నమ్మం’ అన్నవాళ్లు వదిలేయండి. నమ్మేవాళ్లు ఫ్యాషన్‌గా ఉండే కొన్ని రాశుల వారి సంగతులపై సరదాగా ఓ లుక్కేయండి.

* కుంభ రాశి: ఫ్యాషన్‌ విషయంలో పక్కా పర్‌ఫెక్ట్‌లు వీళ్లే. అతిశయోక్తి అనిపించొచ్చుగాక.. లోదుస్తుల విషయంలోనూ రాజీ పడరు. ఫ్యాషన్‌ డిజైనర్లకే పాఠాలు నేర్పేలా డిజైనర్‌ దుస్తులే ధరిస్తారు.

* వృషభం: ఈ జన్మరాశి ఉన్నవాళ్లు సోకులకు బ్రాండ్‌ అంబాసిడర్లు. పడక గదిలోనూ అందంగా ముస్తాబై పవళించే రకం. పనికి రాని పాత గుడ్డ ముక్కలు ఇచ్చినా ఫ్యాషన్‌ ఔట్‌ఫిట్‌గా మార్చే బాపతు. కొత్తట్రెండ్‌ వస్తే ముందు వీళ్ల ఒంటిని చుట్టేయాల్సిందే.

* సింహరాశి: మరీ సినీ జనాల్లా స్టైలిష్‌గా ఉండాలనుకోరు గానీ వీళ్లూ మంచి ఫ్యాషన్‌ ప్రియులే. ఆకట్టుకునే వస్త్రధారణతోనే తమ మూడ్‌ని తెలియజేస్తుంటారు. సందర్భాలకు అనుగుణంగా హుందాగా, స్టైలిష్‌గా మారిపోతుంటారు.

* తులా రాశి: సౌకర్యంగా ఉండేదే ఫ్యాషన్‌ అనుకునే బాపతు. వేడుక, సందర్భం ఏదైనా హుందాగా ఉండాలని ప్రయత్నిస్తారు. వాస్తవికంగా ఆలోచిస్తారు. బ్రాండ్‌ ప్రియులు.

* మిథునం: సందర్భాన్ని బట్టి వీళ్ల తీరు మారిపోతుంటుంది. వీలైతే షోకిల్లారాయుళ్లా తయారవుతారు. కుదరకపోతే ఏం పట్టనట్టే ఉంటారు. అందుబాటులో ఉన్న వాటితోనే ఆకట్టుకునేలా మెరిసిపోతుంటారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు