Updated : 22 Jan 2022 06:12 IST
చిన్న చిట్కాలు.. అన్యోన్యత డబుల్
లైలా-మజ్ఞు, దేవదాసు-పారూ, సలీం-అనార్కలీ జోడీల్లా ఉండాలని అందరూ అనుకుంటారు. ఉండేది మాత్రం కొందరే. ఇంతకీ ఆ గొప్ప ప్రేమికులు, పడుచు జంటల మధ్య అన్యోన్యత ఎలా అంటారా? ఇవిగోండి చిట్కాలు.
* పెద్ద నిర్ణయాలు కలిసే తీసుకుంటారు. చిన్నచిన్న విషయాలూ పంచుకుంటారు.
* ప్రేమ ప్రదర్శించే ఏ సందర్భం వదులుకోరు. శుభాకాంక్షలు చెప్పుకోవడం, చిన్నచిన్న బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం.
* తమ ఆంతరంగిక విషయాల్లో ఇతరుల జోక్యం సహించరు.
* కష్టం, సుఖం.. ప్రతి సందర్భంలో ఒకరికొకరు తోడుంటారు.
* మరింత దగ్గరవడానికి అప్పుడప్పుడూ దూర ప్రయాణాలు చేస్తుంటారు.
* ఇతరులతో పోల్చుకోరు. వేరేవాళ్లలా ఉండాలని ప్రయత్నించరు.
* ఎంత దగ్గరైనా కొంత ప్రైవసీ ఇచ్చిపుచ్చుకుంటారు.
Advertisement
Tags :