బలమైన కాళ్లకు..

బలహీనమైన కాళ్లు.. వేర్లు లేని చెట్టులాంటివంటారు. మన కాళ్లు దృఢంగా ఉంటే శరీరంలో ఉత్సాహం, ఉత్తేజం ఎక్కువ అవుతాయి. అందుకే లోయర్‌ బాడీ, కాళ్లు బలంగా తయారు కావాలంటే ఈ వ్యాయామాలుచేయాలి.    

Published : 23 Jul 2022 01:55 IST

బలహీనమైన కాళ్లు.. వేర్లు లేని చెట్టులాంటివంటారు. మన కాళ్లు దృఢంగా ఉంటే శరీరంలో ఉత్సాహం, ఉత్తేజం ఎక్కువ అవుతాయి. అందుకే లోయర్‌ బాడీ, కాళ్లు బలంగా తయారు కావాలంటే ఈ వ్యాయామాలుచేయాలి.

బార్బెల్‌ స్క్వాట్స్‌
భుజాలపై బరువైన బార్బెల్‌ వేసుకొని ఆ బరువునంతా మోకాళ్లు, పిక్కలు, కాళ్లపై పడేలా బ్యాలెన్స్‌ చేసుకోవాలి. తుంటి, మోకాలు తొంభై డిగ్రీల కోణంలో ఉండేలా చేసి.. పదిహేను నుంచి ఇరవైసార్లు కిందికీ, పైకీ లేవాలి.

మెడిసిన్‌బాల్‌ లాంజెస్‌: లాంజెస్‌ లోయర్‌ బాడీకి మంచి వ్యాయామం. ముందు నిటారుగా నిల్చొని నిదానంగా కుడికాలి మోకాలిని నేలపై వంచి వెనక్కి తీసుకోవాలి. వీపు భాగం నిటారుగా ఉండేలా చేసి భుజాలు రిలాక్స్‌డ్‌గా ఉండాలి. మెడిసిన్‌బాల్‌ని చేతుల్లోకి తీసుకొని బాడీకి దూరంగా జరిపి.. ఒకటి తర్వాత ఒకటిగా ఎడమ, కుడికాలును మార్చుతూ భారమంతా కాళ్లపై పడేలా వర్కవుట్స్‌ చేయాలి.

బాక్స్‌ జంప్స్‌
మోకాలు ఎత్తులో ఉన్న ఒక బాక్స్‌ని కదలకుండా స్థిరంగా ఉంచాలి. దానికి అడుగు దూరంలో వెనక నిల్చొని ఆ బాక్స్‌పైకి గెంతి వెంటనే వెనక్కి వచ్చేయాలి. ఇలా పది నుంచి పదిహేనుసార్లు చేస్తుండాలి.

మెట్లు ఎక్కడం: మెట్లు ఎక్కడం కార్డియోవ్యాస్క్యులర్‌ వ్యాయామంగా పని చేస్తుంది. శరీర బరువునంతా కాలి పిక్కలు, చీలమండల్లో పడేలా కేంద్రకరించి రెండు కాళ్లు మార్చి మార్చి ఒకే మెట్టు ఎక్కి, దిగుతుండాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని