మీదెలాంటి స్నేహం?

దోస్త్‌లను చూసి వాళ్లు ఎలాంటి వాళ్లో చెప్పేయొచ్చంటారు. మరి మీ సంగతేంటి? ఎప్పుడైనా సెల్ఫ్‌ చెక్‌ చేసుకున్నారా? ఇలా ప్రయత్నించి చూడండి ఓసారి.

Published : 06 Aug 2022 01:06 IST

దోస్త్‌లను చూసి వాళ్లు ఎలాంటి వాళ్లో చెప్పేయొచ్చంటారు. మరి మీ సంగతేంటి? ఎప్పుడైనా సెల్ఫ్‌ చెక్‌ చేసుకున్నారా? ఇలా ప్రయత్నించి చూడండి ఓసారి.
కాలేజీ లంచ్‌ సమయం ఎలా గడిపేవారు?
1. బెస్ట్‌ ఫ్రెండ్‌తోనే కలిసి భోజనం చేయడం.. బాతాఖానీ చెప్పుకోవడం.
2. అప్పుడప్పుడు స్నేహితులతో.. లేదంటే క్యాంటీన్‌లో!
3 ఒక్కడినే కూర్చొని ప్రశాంతంగా తింటాను.

స్నేహితులతో ఎక్కువగా ఏ విషయంపై చర్చిస్తావు?
1. వ్యక్తిగత విషయాలు, సరదాలు, కెరీర్‌.. సమస్తం.
2. ప్రేమ, గాసిప్స్‌, సరదాలు.
3. ప్రాజెక్టులు, పని, కెరియర్‌ విషయాలే.

మీ బెస్ట్‌ఫ్రెండ్‌ మిమ్మల్ని వదిలి వేరేచోటికి వెళ్లిపోతుంటే...
1. కుడిభుజం కోల్పోయినట్టే భావిస్తాను.
2. కొంచెం బాధగా ఉన్నా.. మళ్లీ కొత్త ఫ్రెండ్‌ని వెతుక్కుంటాను.
3. జీవితంలో ఇవన్నీ సహజం అని సర్దుకుపోతాను.

వారాంతంలో ఫ్రెండ్‌, మీరు కలిసి ఎక్కడికెళ్తారు?
1. సినిమా, టూర్‌, ఏదైనా ఇద్దరికీ నచ్చే ప్రదేశం.
2. పార్టీ చేసుకుంటాం. షాపింగ్‌ చేస్తాం.
3. ప్రశాంతంగా ఇంట్లోనే ఏదైనా పని చేసుకుంటాను.

మీ స్నేహితుల్లో అపోజిట్‌ జెండర్‌తో స్వేచ్ఛగా బయటికెళ్లగలరా?
1. తప్పకుండా. వాళ్లింట్లోకి సైతం ప్రవేశం ఉంటుంది.
2. సమయం, సందర్భాన్ని బట్టి...
3. స్నేహం ఓకే. కలిసి బయట తిరగడం కష్టమే.

ఏదో పొరపొచ్చాలొచ్చి మీ ఫ్రెండ్‌ మీతో మాట్లాడ్డం మానేస్తే..?
1. క్షమాపణ చెప్పి అయినా తను మాట్లాడేలా చేస్తాను.
2. తను మారి దగ్గరి కొచ్చేంతవరకు ఎదురుచూస్తాను.
3. మాట్లాడటమే మానేస్తాను.

మీ ఫ్రెండ్‌ మీకు నచ్చని, తప్పుడు పని చేశాడు. మీ స్పందన ఎలా ఉంటుంది?
1. తప్పొప్పులు చెప్పి, తనని మార్చడానికి ప్రయత్నిస్తాను.
2. తన తప్పు తనే తెలుసుకునే వరకు ఎదురుచూస్తాను.
3. తప్పుడు పని చేశాడని దూరం పెడతాను.

మీ స్నేహితుడితో ఎలా ఉండటం ఇష్టం?
1. సరదాల్లో, బాధల్లో.. అన్నివేళల్లో పక్కనుండటం.
2. కొంచెం స్పేస్‌ ఇవ్వడం. మరీ వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లకపోవడం.
3. సంతోషాలు పంచేవాడే ఫ్రెండ్‌. సరదాగా ఉంటే చాలు.

* మీ స్కోరు ఏడు మార్కుల లోపు ఉంటే మీరు ఉత్తమ ఫ్రెండ్‌. మీలో ఎలాంటి కల్మషం లేదు. మీలాంటి స్నేహితుడు/స్నేహితురాలు దొరకడం ఎదుటివాళ్ల అదృష్టం.
* మార్కులు ఎనిమిది నుంచి పద్దెనిమిది మధ్య ఉంటే మీరు మధ్యరకం. మీ స్నేహంలో స్వచ్ఛత, అవకాశవాదం.. రెండింటికీ అవకాశం ఉంది.
* పద్దెనిమిది దాటితే మీరు పక్కా స్వార్థపరులు. స్నేహాన్ని ఒక అవసరంగా, అవకాశంగా భావిస్తారు.


వాళ్లంతా  డార్లింగ్సే..

ప్రభాస్‌

మనం ఎదిగినప్పుడు ఆ సంతోషాన్ని పంచుకోవడానికి, కింద పడ్డప్పుడూ చేయి పట్టుకొని లేపడానికీ స్నేహితులుండాలి. స్నేహితుడు లేని జీవితం లెన్స్‌ లేని కెమెరాలాంటిది. నేను చెన్నై, హైదరాబాద్‌లో చదువుకున్నప్పటి క్లాస్‌మేట్స్‌ ఇప్పటికీ టచ్‌లో ఉంటారు. పరిశ్రమలో గోపీచంద్‌, అల్లు అర్జున్‌, అనుష్క, ఎస్‌.ఎస్‌.రాజమౌళి, పూరి జగన్నాథ్‌ అంతా నా ఫ్రెండ్సే. ఈ స్నేహితులు లేకపోతే నేను ఎక్కడో ఆగిపోయేవాణ్ని. దగ్గరి ఫ్రెండ్స్‌ నాకో ఇరవై మంది దాకా ఉంటారు. నా ప్రతి విషయం వాళ్లతో పంచుకుంటా.
 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని