బ్యాక్‌ప్యాకే తెరగా

కాలేజీ కుర్రాడికైనా, కార్యాలయానికెళ్లే యువోద్యోగికైనా.. ఈరోజుల్లో బ్యాక్‌ప్యాక్‌ లేకుండా పని ముందుకెళ్లదు. వాళ్లని ఆకట్టుకునేలా రకరకాల డిజైన్లు, పరిమాణాల్లో అందుబాటులోనూ ఉన్నాయి

Updated : 19 Nov 2022 00:31 IST

కాలేజీ కుర్రాడికైనా, కార్యాలయానికెళ్లే యువోద్యోగికైనా.. ఈరోజుల్లో బ్యాక్‌ప్యాక్‌ లేకుండా పని ముందుకెళ్లదు. వాళ్లని ఆకట్టుకునేలా రకరకాల డిజైన్లు, పరిమాణాల్లో అందుబాటులోనూ ఉన్నాయి. వీటన్నింటికన్నా భిన్నంగా, టెక్నాలజీని జత చేర్చి  B-PIX4 Backpack అనే సరికొత్త బ్యాక్‌ప్యాక్‌ని మార్కెట్లోకి తీసుకొచ్చింది BIOSLED కంపెనీ. దీని ప్రత్యేకత ఏంటంటే.. బ్యాక్‌ప్యాక్‌ వెనకాల భాగంలో ఎల్‌సీడీ, ఓఎల్‌ఈడీ తెర ఉంటుంది. 96 x 128 పరిమాణపు తెరలో ఫొటోలు, వీడియోలు, జిఫ్‌ ఫైల్స్‌, క్యూఆర్‌ కోడ్‌లు అన్నీ ప్లే అవుతాయి. చీకట్లో ఎల్‌ఈడీ ల్యాంప్‌లా కూడా పని చేస్తుంది.  స్మార్ట్‌ఫోన్‌ యాప్‌ ద్వారా దీన్ని నియంత్రించవచ్చు. కొత్తదనం కోరుకునే యువత మెచ్చేలా ఉండే ఈ బ్యాక్‌ప్యాక్‌ ధర రూ.3,999.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని