Updated : 28 Jan 2023 03:22 IST

ఓవర్‌సైజ్‌కే..కుర్ర ఓటు

కుర్రదాని వాలు చూపు సోకగానే చిత్తైపోయే కుర్రాళ్లు ఎంతోమంది. కోటి రాగాలు పలికించే కళ్లంటే అమ్మాయిలు, అబ్బాయిలు ఎవరికైనా ఇష్టమే. మన ముఖంలో అత్యంత ఆకర్షణీయమైనవి కళ్లేనంటారు. మరి అంత ముఖ్యమైన ఆ నయనాల అందం రెట్టింపయ్యేలా చేసేవి గాగుల్స్‌. స్టైల్‌ కోసం చాలామంది వీటిని ధరిస్తుంటారు. అందులోనూ ఈ మధ్య కాలంలో పెద్ద సైజు కళ్లద్దాలపై ఎక్కువ మోజు పడుతున్నారు. అభిమాన తారల నుంచి వీధుల్లోని కుర్రకారు దాకా.. ఈ స్టైల్‌కే సై అంటున్నారు. ఇందులో త్రిభుజాకారం, వలయాకారం, చతురస్రం, క్యాట్‌ ఐ, ఏవియేటర్‌, జియోమెట్రిక్‌.. ఇలా ఎవరికి నచ్చినవి వాళ్లు ఫాలో అవుతున్నారు. ఈ ఓవర్‌సైజ్డ్‌ కళ్లద్దాలు ధరించడం వల్ల చూపు స్పష్టంగా ఉంటుంది. మన ముఖం ఎదుటివాళ్లకు బాగా కనిపిస్తుంది. కళ్లద్దాల ఫ్రేమ్‌లకు నచ్చినట్టుగా డిజైన్‌ చేసుకునే వెసులుబాటూ ఉండటంతో అంతా వీటికి ఫిదా అవుతున్నారు. బ్లేజర్లు, సూట్లు, మోడ్రన్‌ డ్రెస్‌లకు ఇవి నప్పుతాయి. ఇన్ని ప్లస్‌ పాయింట్లు ఉండటంతో ఈమధ్యకాలంలో ఓవర్‌సైజ్డ్‌ కళ్లద్దాలు పాపులర్‌ ట్రెండ్‌గా మారాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని