మైలేజీ పెరిగేలా..

చేతిలో బండి ఉంటే కుర్రకారుకి కాలు నిలవదు. షికార్లు, టూర్లు అంటూ తిరుగుతూనే ఉంటారు. అసలే ఇంధనం ధరలు మండిపోతున్న కాలం.

Published : 04 Mar 2023 00:26 IST

యువాహనం

చేతిలో బండి ఉంటే కుర్రకారుకి కాలు నిలవదు. షికార్లు, టూర్లు అంటూ తిరుగుతూనే ఉంటారు. అసలే ఇంధనం ధరలు మండిపోతున్న కాలం. మరి మంచి మైలేజీ రావాలంటే ఏం చేయాలి?

* గేర్‌ వేయగానే యాక్సిలరేటర్‌ ఒక్కసారిగా తిప్పేస్తుంటారు కొందరు. దీంతో త్రోటల్‌, ఇంజిన్‌ అధిక ఇంధనాన్ని పీల్చేస్తుంటాయి. అలా కాకుండా బండి కదిలిన కాసేపటికి నెమ్మదిగా యాక్సిలరేటర్‌ని పెంచాలి.

* కారణాలేమైనా చాలామంది బండి ఇంజిన్‌ని ఆన్‌ చేసి నిమిషాల పాటు అలాగే ఉంచుతారు. దీంతో పెట్రోల్‌ అత్యధికంగా వినియోగమవుతుంది. ప్రస్తుతం అన్ని వాహనాల్లో ఆటోమేటిక్‌ సదుపాయం ఉండటంతో బండిని ఐడ్లింగ్‌లో ఉంచకుండా అవసరం ఉన్నప్పుడే ఆన్‌ చేసుకోవచ్చు.

* టైర్లలో గాలి తక్కువైతే బండి ముందుకు కదలదు. ఎక్కువైతే కుదుపులుంటాయి. ఇంతేకాదు.. ఇది ఇంధన వినియోగం మీదా ప్రభావం చూపిస్తుంది. పదిహేను  రోజులకోసారైనా టైర్లలో గాలి తగినంతగా ఉందా? లేదా? అని  చూసుకోవాలి.

* లో గేర్లలో ద్విచక్రవాహనం నడిపినప్పుడు ఇంధన వినియోగం ఎక్కువ. సాధ్యమైనంత ఎక్కువగా టాప్‌గేర్‌లో నడపడానికే ప్రయత్నించాలి.

సమయానుకూలంగా బండిని సర్వీసింగ్‌ చేయిస్తుంటే ఇంజిన్‌ సహా అన్ని కీలకమైన భాగాలు బాగా పని చేస్తాయి. మైలేజీ పెరుగుతుంది. బైక్‌ ఎక్కువ కాలం మన్నికగా ఉంటుంది.
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని