బురదలో సరదాలాట!

గోవా అనగానే మనకు బీచ్‌లు గుర్తొస్తాయి. షార్ట్‌లు వేసుకొని సరదాగా తీరం వెంట నడిచే జంటలు కనువిందు చేస్తాయి. వాటితోపాటు ఈ సీజన్‌లో ‘చిక్కల్‌ కాలో’ సందడి ఎక్కువే ఉంటుంది.

Published : 08 Jul 2023 00:56 IST

గోవా అనగానే మనకు బీచ్‌లు గుర్తొస్తాయి. షార్ట్‌లు వేసుకొని సరదాగా తీరం వెంట నడిచే జంటలు కనువిందు చేస్తాయి. వాటితోపాటు ఈ సీజన్‌లో ‘చిక్కల్‌ కాలో’ సందడి ఎక్కువే ఉంటుంది. అసలేంటిది అంటే.. బురదలో సరదాలాట. సంప్రదాయం, సరదా మేళవించిన ఈ కేళిలో ముందుంటోంది యువతే.

గోవా సమీపంలోని మార్సెల్‌ అనే గ్రామంలో ఈ మడ్‌ ఫెస్టివల్‌ అప్పుడెప్పుడో మొదలైంది. నేల తల్లి, రైతులకు మధ్య ఉండే అనుబంధానికి గుర్తుగా ఆషాఢ మాసం మొదలైన పదకొండో రోజున.. ఏటా నిర్వహించడం ఆనవాయితీగా మారింది. మొదటిసారి దేవకీకృష్ణ ఆలయం పరిసరాల్లో ఈ ఆట ఏర్పాటు చేశారు. క్రమంగా ఇది చుట్టుపక్కల ప్రాంతాలకీ పాకిపోవడం.. యువత పెద్దఎత్తున ఇందులో పాల్గొనడంతో రాష్ట్రం అంతటా విస్తరించసాగింది. కొన్నేళ్ల నుంచి గోవా టూరిజం డిపార్ట్‌మెంట్‌ అధికారికంగా ఈ మడ్‌ ఫెస్టివల్‌ని నిర్వహిస్తోంది. సాధారణంగా ఈ సమయంలో వర్షాలు కురిసి ప్రాంతాలన్నీ బురదతో చిత్తడిగా మారుతుంటాయి. ఆట రంజుగా సాగడానికి ఇది కూడా ఓ కారణమే. ఇందులో ఆడా, మగా అనే తేడాలేం లేకుండా.. యువత ఆ బురదలో దిగి ఒకర్నొకరు తోసుకోవడం.. కబడ్డీలాంటి ఆటలాడటం చేస్తుంటారు. ఈ వేడుకల్ని చూడటానికి జనం పెద్ద ఎత్తున ఎగబడుతున్నారు. కొందరు విదేశీయులు సైతం ప్రత్యేకంగా ఈ వేడుక కోసమే వస్తున్నారు. భక్తి, సరదా రెండూ కలిసిన ఈ సంబరాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఆసక్తి ఉన్న కుర్రకారు అక్కడ వాలిపోవచ్చు.


సందర్భం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని