ఉపవాసంలో వ్యాయామం ?

బరువు తగ్గాలనో.. భక్తి కోసమో.. ఆరోగ్యానికి మంచిదనో.. కారణం ఏదైనా నిత్యం వ్యాయామం చేసే కుర్రకారులో ఉపవాసం ఉండే వాళ్లుంటారు. ఈ సమయంలో వాళ్లేం జాగ్రత్తలు తీసుకోవాలంటే...

Updated : 15 Jul 2023 00:44 IST

బరువు తగ్గాలనో.. భక్తి కోసమో.. ఆరోగ్యానికి మంచిదనో.. కారణం ఏదైనా నిత్యం వ్యాయామం చేసే కుర్రకారులో ఉపవాసం ఉండే వాళ్లుంటారు. ఈ సమయంలో వాళ్లేం జాగ్రత్తలు తీసుకోవాలంటే...

* ఉపవాసంలో ఉన్నప్పుడు తేలికపాటి వ్యాయామాలే ఉత్తమం. శరీరానికి తగినన్ని కార్బోహైడ్రేట్లు అందవు. శక్తి సన్నగిల్లుతుంది. బరువులు ఎత్తే ఓపిక ఉండదు.
* ఆహారం తీసుకోకపోయినా.. పంతంకొద్దీ హైఇంటెన్సిటీ వ్యాయామాలు చేస్తే కండరాల క్షీణత ప్రమాదం ఉందంటారు నిపుణులు.
* తక్కువ శ్రమతో ఎక్కువ ప్రయోజనం కలిగించేవి రిస్టోరేటివ్‌ యోగాసనాలు. నేలపై పడుకోవడం లాంటి ఈ కసరత్తులు హార్మోన్ల సమతుల్యతనూ కాపాడతాయి. ఈ సమయంలో వీటిని ఆచరించడం ఉత్తమం.
* ఫాస్టింగ్‌లో ఉన్నప్పుడు ఎక్కువ బరువులెత్తే, వేగంగా పరుగెత్తే వ్యాయామాలు చేయొద్దు. మంచినీళ్లు సైతం ముట్టుకోని కఠిన ఉపవాసం అయితే అసలు వ్యాయామం జోలికే వెళ్లకపోవడమే మంచిదంటారు.
* బరువు పెరగడానికి కూడా కొందరు వర్కవుట్లు చేస్తుంటారు. దానికోసం వర్కవుట్‌కి ముందే కొన్నిరకాల ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. ఉపవాసం ఉండేవాళ్లు బరువు పెరిగే వ్యాయామాలు అసలే చేయొద్దు.
* పాక్షిక ఉపవాసం, తక్కువ కేలరీల ఆహారం తీసుకునేవారు కార్డియోలాంటి కసరత్తులు చేయొచ్చు. పూర్తిగా అసలేం తినకుండా ఉంటే.. తేలికైన నడక, జెంటిల్‌ పైలేట్స్‌.. సరిపోతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని