రొమాంటిక్‌ కామెడీలే నచ్చుతాయట

‘మీరెలాంటి సినిమాలు కలిసి చూస్తారు?’ ‘అవేమైనా మీ జీవితాలపై ప్రభావం చూపిస్తాయా?’ ఇలాంటి సందేహాలు ప్రేమికుల ముందు పెట్టింది క్వాక్‌క్వాక్‌ అనే డేటింగ్‌ యాప్‌. జనరేషన్‌ జడ్‌ ప్రేమికులు ఏమన్నారంటే...

Published : 22 Jul 2023 00:44 IST

అధ్యయనం

‘మీరెలాంటి సినిమాలు కలిసి చూస్తారు?’ ‘అవేమైనా మీ జీవితాలపై ప్రభావం చూపిస్తాయా?’ ఇలాంటి సందేహాలు ప్రేమికుల ముందు పెట్టింది క్వాక్‌క్వాక్‌ అనే డేటింగ్‌ యాప్‌. జనరేషన్‌ జడ్‌ ప్రేమికులు ఏమన్నారంటే...

ప్రేమికుల్లో అత్యధికులు కలిసి చూసేదీ.. మొదటి మూవీ డేట్‌కి ఓటేసేదీ రొమాంటిక్‌ కామెడీలకేనట.

ఇందులో 57శాతం మంది సినిమాల్లో చూపించినంతగా మా జీవితాల్లో రొమాన్స్‌, కామెడీ లేవని అసంతృప్తి వ్యక్తం చేశారు.

సినిమాల్లో ఉన్నట్టుగా మా ప్రేమలోనూ సరదాలు, రొమాన్స్‌ ఉండాలని అబ్బాయిలకన్నా అమ్మాయిలే ఎక్కువగా కోరుకుంటున్నారు.


సినిమాలు కలిసి  చూస్తే ఇద్దరి మధ్యా ప్రేమ మరింత పెరుగుతుందని 23 శాతం మంది భావిస్తున్నారు.


రొమాంటిక్‌ కామెడీలు చూస్తున్నప్పుడు నాయికానాయకుల పాత్రల్లో మమ్మల్ని మేం ఊహించు కుంటున్నామని 29 శాతం
మంది సెలవిచ్చారు.

దేశంలోని మెట్రో నగరాలతోపాటు మరో నాలుగు పట్టణాల్లో 20 వేల మందితో ఈ ఆన్‌లైన్‌ సర్వే నిర్వహించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు