యాపిల్‌ ఫోనే..వీఆర్‌ హెడ్‌సెట్‌

ఉన్నచోటే ఉంటూ.. మనల్ని ఊహల ప్రపంచంలోకి తీసుకెళ్లేది వీఆర్‌ (వర్చువల్‌ రియాలిటీ) హెడ్‌సెట్‌. యువత బాగా ఇష్టపడే గ్యాడ్జెట్‌ ఇది. దీని ధరా ఎక్కువే.

Updated : 12 Aug 2023 01:16 IST

ఉన్నచోటే ఉంటూ.. మనల్ని ఊహల ప్రపంచంలోకి తీసుకెళ్లేది వీఆర్‌ (వర్చువల్‌ రియాలిటీ) హెడ్‌సెట్‌. యువత బాగా ఇష్టపడే గ్యాడ్జెట్‌ ఇది. దీని ధరా ఎక్కువే. ఇక యాపిల్‌ కంపెనీ విజన్‌ ప్రొ వీఆర్‌హెడ్‌ వెల అయితే ఏకంగా రూ.3లక్షలు ఉంటుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్నిరకాల ఐఫోన్‌ మోడళ్లనే వీఆర్‌ హెడ్‌సెట్‌లుగా మలిచే ఒక ప్రత్యేకమైన గ్లాస్‌ని తయారు చేసింది యాపిల్‌ కంపెనీ. దీనిపై పేటెంట్‌ కూడా దక్కించుకుంది. ఈ గ్లాసెస్‌ ఫోన్‌ని తనలో అమర్చుకోవడమే కాదు.. రిమోట్‌ కంట్రోల్‌గానూ పని చేస్తుంది. వాల్యూమ్‌ పెంచడం, తగ్గించడం చేయొచ్చు. వచ్చే ఏడాది ఇది విపణిలోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు. అంటే తక్కువ బడ్జెట్‌లో భారీ అనుభూతి పొందడానికి యువత సిద్ధంగా ఉండొచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని