సెల్‌ఫోన్‌ అంటే మాకు ప్రాణం

సెల్‌ఫోన్‌ అంటే మాకు ప్రాణం. పొద్దున ఆరు గంటలకే నిద్ర లేస్తాం. వీడియోలన్నీ చూస్తాం. వాట్సప్‌లో చాటింగ్‌ చేస్తాం. రిప్లై కోసం సిల్లీఫెలోస్‌లా ఎదురు చూస్తాం.

Published : 19 Aug 2023 00:53 IST

పశువులంటే మాకు ప్రాణం.. యాడ్‌కు పేరడీ...

సెల్‌ఫోన్‌ అంటే మాకు ప్రాణం. పొద్దున ఆరు గంటలకే నిద్ర లేస్తాం. వీడియోలన్నీ చూస్తాం. వాట్సప్‌లో చాటింగ్‌ చేస్తాం. రిప్లై కోసం సిల్లీఫెలోస్‌లా ఎదురు చూస్తాం. కోతిలా ఫొటోలకు పోజులిస్తాం. అన్నీ స్టేటస్‌లో పెట్టేస్తాం. వచ్చిన కామెంట్లు చూసి మురిసిపోతాం. ఫేస్‌బుక్‌లోనూ వాటిని పంచుకుంటాం. కొంచెం బాగుందా.. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌ చేసి పెడతాం. ట్విటర్‌లో ట్వీట్లు పెడతాం. వివాదాలను కొని తెచ్చుకుంటాం. అవసరమైతే తిండి మానేస్తాం. అనవసరమైన వాటిని వెతికేస్తాం. సైబర్‌ లింక్‌లను తెలియక క్లిక్‌ చేస్తాం. బ్యాంకు ఖాతాలో డబ్బులు ఖాళీ చేయిస్తాం. ఆఖరికి పోలీసులను ఆశ్రయిస్తాం. అయినా మేం తీరు మార్చుకోం. ఎందుకంటే సెల్‌ఫోన్‌ అంటే మాకు ప్రాణం. సెల్‌ఫోన్‌ లేకుండా మేం బతకలేం. మా సెల్లులకు యజమానులం మేమే!

 పి.సాంబశివారెడ్డి, కడప


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని