తీరని వేదన తీర్చే దారులివి..

బయటివాళ్లకు ఇవి చిన్న విషయాలేగానీ.. శ్రావ్య, అజయ్‌లకు అవో గుదిబండల్లాంటి సమస్యలు. వీటిని పదేపదే తలచుకొని కుమిలిపోతుంటారు.

Published : 19 Aug 2023 00:53 IST

* లావుగా ఉండటం నా తప్పా? నన్నే అందరూ వింతగా చూస్తారెందుకు?

 ఇది బీటెక్‌ చదివే శ్రావ్య మనోవేదన

* అసలు పని చేయని వాళ్లను వదిలేసి, బండెడు చాకిరీ చేసే నన్నే బాస్‌ తిడతారెందుకు?

 ఉద్యోగి అజయ్‌ అంతర్మథనం

యటివాళ్లకు ఇవి చిన్న విషయాలేగానీ.. శ్రావ్య, అజయ్‌లకు అవో గుదిబండల్లాంటి సమస్యలు. వీటిని పదేపదే తలచుకొని కుమిలిపోతుంటారు. చదువులు, కెరియర్‌లో వెనకబడుతుంటారు. ఇలాంటి వాళ్లు ఎందరో.. ఈ చిట్కాలు పాటిస్తే.. కొంతలో కొంతైనా ఆ ప్రభావం నుంచి బయట పడొచ్చు.

  •  కష్టాలు ఎల్లకాలం ఉండవు.. సంతోషాలు తిరిగి రాక మానవు. ఇక్కడ ఏదీ శాశ్వతం కాదనే విషయం గుర్తు పెట్టుకోవాలి. మనకన్నా రెట్టింపు సమస్యలు ఉన్నవాళ్లతో పోల్చి చూసుకుంటే మన ఇబ్బందులు దూదిపింజల్లా తేలిపోతాయి.
  • నా గురించి వాళ్లు ఏమను కుంటున్నారు? ఈ పని చేస్తే అవతలివాళ్లకు నచ్చుతుందా? ఈ తరహా ఆలోచనలు మానసిక ఇబ్బందుల్లోకి నెట్టేస్తాయి. మనకు మనమే తొలి ప్రాధాన్యం. వేరేవాళ్లని కన్విన్స్‌ చేయాలని ప్రయత్నించే బదులు మన లక్ష్యాలు, ఆశయాలపైనే దృష్టి పెట్టాలి.
  • మనం ఎంత ప్రయత్నించినా నూటికి నూరు శాతం మందికీ నచ్చలేం. ఎంత చేసినా, ఏం చేసినా విమర్శించే వాళ్లు ఉంటారు. సద్విమర్శల్ని స్వీకరించగలిగే మనసుండాలి. విమర్శించడమే పనిగా పెట్టుకున్నవాళ్లను తేలికగా తీసుకోవాలి.
  • పదేపదే ఒకే విషయంపై మథన పడటం వల్ల సమయం వృథా. చేసే పని పాడవుతుంది. పైగా అనవసరమైన బాధ. ఆ పరిస్థితి వచ్చిన ప్రతిసారీ లాభనష్టాలను ఓ కాగితంపై రాసుకోండి. మామూలు సమయాల్లో ఒక్కసారి తిరగేయండి. కచ్చితంగా మీలో మార్పు మొదలవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని