చుక్కలూ చూస్తావా?

కరోనా తర్వాత విద్యాసంస్థలు తెరిచిన సమయం అది. మా ఎంబీఏ కళాశాలలో హాజరు కోసం బయోమెట్రిక్‌ పద్ధతి పెట్టారు. లోపలికి రాగానే విద్యార్థులంతా ఫేస్‌ రికగ్నిషన్‌ యంత్రం ముందు వరుసలో వచ్చి నిల్చొనేవారు.

Published : 26 Aug 2023 00:18 IST

రోనా తర్వాత విద్యాసంస్థలు తెరిచిన సమయం అది. మా ఎంబీఏ కళాశాలలో హాజరు కోసం బయోమెట్రిక్‌ పద్ధతి పెట్టారు. లోపలికి రాగానే విద్యార్థులంతా ఫేస్‌ రికగ్నిషన్‌ యంత్రం ముందు వరుసలో వచ్చి నిల్చొనేవారు. మా క్లాస్‌మేట్‌ శ్రద్ధ అంటే నాకు చాలా ఇష్టం. చాలారోజులుగా తనతో మాట కలపడానికి ప్రయత్నిస్తున్నా. ఓరోజు వరుసలో తన వెనకాలే వచ్చి నిల్చున్నా. ఈసారి ఎలాగైనా తనతో మాట్లాడాలని ధైర్యం కూడ దీసుకుంటున్నా. తనవంతు రాగానే యంత్రం మొరాయించింది. తను చిరాకుగా మాస్క్‌ తీసేసి ‘ఈ కొత్త పద్ధతేంటో.. పాతదే ఉంటే సరిపోయేదిగా’ అని పైకే అనేసింది. నేను వెంటనే ‘చందమామలాంటి నీ అందమైన మొహం అందరికీ కనబడాలిగా.. అందుకే’ అని ధైర్యంగా అనేశా. తన రియాక్షన్‌ కోసం చూస్తుంటే.. ‘చందమామే కాదు.. చుక్కలు కూడా చూపిస్తానురా’ అంటూ వెనకాలే నిల్చున్న మా లెక్చరర్‌ నా నెత్తిపై ఒక్కటిచ్చారు. శ్రద్ధ నవ్వు ఆపుకుంటుంటే.. నేను నోర్మూసుకొని గబగబా అక్కడ్నుంచి
వెళ్లిపోయాను.

ఎస్‌. ప్రవీణ్‌, ఇబ్రహీంపట్నం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని