విరాట్‌లా కుమ్మేద్దామా?

సెంచరీల మీద సెంచరీలు బాదనీ.. ఫామ్‌ లేమితో సతమతమవనీ.. ఒక్కరోజైనా వ్యాయామానికి డుమ్మా కొట్టని క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి. అందుకే 35 ఏళ్ల వయసొచ్చినా ఫిట్‌నెస్‌ విషయంలో కుర్రాళ్లతో పోటీ పడుతుంటాడు

Published : 02 Sep 2023 00:23 IST

సెంచరీల మీద సెంచరీలు బాదనీ.. ఫామ్‌ లేమితో సతమతమవనీ.. ఒక్కరోజైనా వ్యాయామానికి డుమ్మా కొట్టని క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి. అందుకే 35 ఏళ్ల వయసొచ్చినా ఫిట్‌నెస్‌ విషయంలో కుర్రాళ్లతో పోటీ పడుతుంటాడు. ఇంతకీ తను మైదానంలో చిరుతలా పరుగెత్తడానికి ఏమేం కసరత్తులు చేస్తాడో తెలుసుకొని మనమూ ఆచరిద్దామా..

  • స్క్వాట్‌ విత్‌ ఓవర్‌హెడ్‌ ప్రెస్‌

  • బలమైన కాళ్లకు ఇది చక్కని కసరత్తు. క్వాడ్రిసెప్స్‌, గ్లూట్స్‌, స్నాయువులు గట్టిపడతాయి. బరువులు ఎత్తడంతో భుజాలు, చేతి కండరాలూ దృఢమవుతాయి
  •  డెడ్‌లిఫ్ట్‌ టు బైసెప్‌

  • ఈ బరువులెత్తే వ్యాయామం మొత్తం శరీరాన్ని కవర్‌ చేస్తుంది. చేతి కండరాలు, పిరుదులు, స్నాయువు.. అన్నీ దృఢమవుతాయి. చేతులు, వీపు, కాలి పిక్కలు, భుజాలూ బలపడతాయి.
  •  రివర్స్‌ లంజెస్‌

  • లోయర్‌ బాడీని ఫిట్‌గా ఉంచే కసరత్తుల్లో ఇది అత్యుత్తమం అంటారు ఫిట్‌నెస్‌ గురూలు. మోకాళ్ల మీద ఎక్కువ భారం పడకుండా లోయర్‌ బాడీ కండరాలను దృఢం చేసే వ్యాయామం ఇది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని