అబ్బాయి.. అమ్మ.. కిట్‌క్యాట్‌

క్లాసులో ఒకబ్బాయి నాకు రోజూ కిట్‌క్యాట్‌ తీసుకొచ్చి ఇస్తుండేవాడు. దాంతో తను బాగా నచ్చేవాడు. నిజానికి దానికోసమే రోజూ తరగతులకి వెళ్లేదాన్ని.

Published : 23 Sep 2023 00:45 IST

క్లాసులో ఒకబ్బాయి నాకు రోజూ కిట్‌క్యాట్‌ తీసుకొచ్చి ఇస్తుండేవాడు. దాంతో తను బాగా నచ్చేవాడు. నిజానికి దానికోసమే రోజూ తరగతులకి వెళ్లేదాన్ని. ఇక ఆదివారం వస్తుందంటే నా చాక్లెట్‌ మిస్‌ అవుతుందని చిరాగ్గా ఉండేది. మామూలు రోజుల్లో దాని కోసమే ఆ అబ్బాయికి ఫోన్‌ చేసేదాన్ని. అయితే తినేసిన చాక్లెట్‌ ర్యాపర్లు పడేయకుండా బ్యాగులో దాచుకోవడం నా కొంప ముంచింది. ఓసారి నేను బయటికెళ్లినప్పుడు బ్యాగులోకి చీమలు దూరడం అమ్మ గమనించింది. ర్యాపర్లు.. వాటి వెనకాల ఉన్న కిట్‌క్యాట్‌ల కథేంటో నన్ను నిలదీసి ఆరా తీసింది. ఇంకేముంది.. ఆ అబ్బాయితో ఏదో జరిగిపోతోందని.. మర్నాడే మా క్లాసుకి వచ్చి రచ్చరచ్చ చేసింది. ‘ఇంకోసారి మా అమ్మాయికి చాక్లెట్‌ ఇస్తే బాగుండదు’ అని ఆ అబ్బాయికి వార్నింగ్‌ ఇచ్చింది. అతగాడు దడుసుకొని కిట్‌క్యాట్‌ తేవడం మానేశాడు. తర్వాత నేనెన్ని ట్రిక్‌లు ప్లే చేసినా.. అతడు మళ్లీ నావైపు చూడలేదు. క్లాసురూం ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ ఆ తీపి రోజులు గుర్తొస్తూనే ఉంటాయి.
ఎస్‌.శ్రావణి, ఈమెయిల్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని