ఆన్‌లైన్‌లో చెలరేగడానికో కోర్సు

నిద్ర లేవగానే వాట్సప్‌.. మనసులో భావం వెల్లడించడానికి ఎక్స్‌.. అందమైన ఫొటోల అప్‌లోడ్‌కి ఇన్‌స్టాగ్రామ్‌.. ప్రతిభని ప్రదర్శించడానికి టెలిగ్రామ్‌..

Published : 30 Sep 2023 00:08 IST

నిద్ర లేవగానే వాట్సప్‌.. మనసులో భావం వెల్లడించడానికి ఎక్స్‌.. అందమైన ఫొటోల అప్‌లోడ్‌కి ఇన్‌స్టాగ్రామ్‌.. ప్రతిభని ప్రదర్శించడానికి టెలిగ్రామ్‌.. ఇలా సామాజిక మాధ్యమాల్లో విహరించకుండా యువతకు రోజు గడవని కాలమిది. కాలక్షేపానికే కాదు.. తమకున్న పాపులారిటీ, ఫాలోయింగ్‌ని సంపాదనకు మార్గంగా మలచుకున్న కుర్రకారూ లేకపోలేదు. వీళ్లనే ఇన్‌ఫ్లుయెన్సర్లు అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటివాళ్లు 6.4కోట్ల మంది ఉన్నారట. ఫోర్బ్స్‌ అధ్యయనం ప్రకారం ప్రతి ఐదుగురిలో ఒకరు ఇన్‌ఫ్లుయెన్సర్‌ కావాలనుకుంటున్నారు. రాబోయే రోజుల్లో వీళ్లు సెలెబ్రిటీలని మించి దూసుకెళ్లే అవకాశముందట. మరి అంతటి విస్తృతమైన పరిధి ఉన్న ఈ సబ్జెక్టుని ఓ క్రమపద్ధతిలో బోధించే కోర్సు లేకపోతే ఎలా? అనుకుంది ఐర్లాండ్‌లోని సౌతీస్ట్‌ టెక్నికల్‌ యూనివర్సిటీ. ఈ ఏడాదే.. బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ ఇన్‌ కంటెంట్‌ క్రియేషన్‌ అండ్‌ సోషల్‌మీడియా అనే ఒక సరికొత్త కోర్సును ప్రారంభించింది. ప్రపంచంలోనే ఈ తరహాలో ఇదే మొదటిది. ఇందులో ఫాలోయర్లను ఎలా ఆకట్టుకోవాలి? ఎలాంటి కంటెంట్‌ పెట్టాలి? ఏమేం ఫొటోలు అప్‌లోడ్‌ చేయాలి? కెమెరా వాడే విధానమేంటి? మార్కెటింగ్‌ ఎలా చేయాలి? ఇలాంటివన్నీ నేర్పిస్తారట. ఇన్‌ఫ్లుయెన్సర్లూ.. ఓ లుక్కేయండి మరి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని