హోండా టూర్‌కి సిద్ధమా...

నచ్చిన బైక్‌పై జామ్మంటూ దూసుకెళ్లడమే కాదు.. మనసుకి నచ్చే ద్విచక్రవాహనాల గురించి తెలుసుకోవడమన్నా యువతకి ఇష్టమే. ముఖ్యంగా హై-ఎండ్‌ టూవీలర్లంటే ఓ చూపు చూడాల్సిందే.

Published : 30 Sep 2023 00:08 IST

చ్చిన బైక్‌పై జామ్మంటూ దూసుకెళ్లడమే కాదు.. మనసుకి నచ్చే ద్విచక్రవాహనాల గురించి తెలుసుకోవడమన్నా యువతకి ఇష్టమే. ముఖ్యంగా హై-ఎండ్‌ టూవీలర్లంటే ఓ చూపు చూడాల్సిందే. అలాంటి అత్యంత ఖరీదైన వాహనమే హోండా గోల్డ్‌వింగ్‌ టూర్‌ బైక్‌. విలాసం, సౌకర్యం, పనితీరులో దీన్ని మించింది లేదంటోంది తయారీదారు. ముఖ్యంగా లాంగ్‌డ్రైవ్‌లకు వెళ్లేవారికి అత్యంత అనువుగా ఉంటుంది. 1,833 సీసీ, సిక్స్‌ సిలిండర్‌ మోటార్‌, 7స్పీడ్‌ డ్యుయల్‌ క్లచ్‌ ట్రాన్స్‌మిషన్‌, 7అంగుళాల టీఎఫ్‌టీ తెర, ఎల్‌ఈడీ లైటింగ్‌ సిస్టమ్‌, ఏబీఎస్‌, సుపీరియర్‌ ఏరోడైనమిక్స్‌, ఎయిర్‌బ్యాగ్‌లు.. ఇలా ఎన్నో ఫీచర్లు, భద్రతాంశాలు ఉన్నాయి. ధర రూ.39.20లక్షలు. అక్టోబరు నుంచి అమ్మకాలు మొదలవుతున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని