కొత్త జాయింట్‌ కనుగొన్నా..!

నా ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరంలో జరిగిందీ సరదా సంఘటన. ఓరోజు అనాటమీ సర్‌ పాఠం చెబుతున్నారు. బాగా బోర్‌గా ఉండటంతో.. నాకు నిద్ర పట్టేసింది

Published : 07 Oct 2023 00:35 IST

నా ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరంలో జరిగిందీ సరదా సంఘటన. ఓరోజు అనాటమీ సర్‌ పాఠం చెబుతున్నారు. బాగా బోర్‌గా ఉండటంతో.. నాకు నిద్ర పట్టేసింది.  కాసేపటికి సర్‌ నన్ను గమనించి క్లాస్‌ చెప్పడం ఆపేశారు. దాంతో నా క్లాస్‌మేట్స్‌ అంతా నవ్వడం మొదలు పెట్టారు. నాకు మెలకువ వచ్చి కళ్లు తెరిచాను. సర్‌ నా దగ్గరికొచ్చి ‘ఏంటి నాన్నా నిద్ర పోతున్నావా?’ అన్నారు. ‘లేదు సర్‌.. కళ్లు మూసుకొని పాఠం వింటున్నా’ అంటూ కవర్‌ చేసుకోవడానికి ప్రయత్నించా. ‘ఓహో.. అలాగా’ అంటూ పాఠంలోని రెండు ప్రశ్నలడిగారు. నా దగ్గర సమాధానం లేదు. ‘పోనీ ఏం సబ్జెక్టు గురించి చెబుతున్నానో తెలుసా?’ అన్నారు. నేను ‘థైరోమండిబ్యులర్‌ జాయింట్‌’ అన్నాను గట్టిగా. ‘చూశారా.. బాబు మనిషిలో కొత్త రకం జాయింట్‌ కనిపెట్టాడు. ఇతడు డాక్టర్‌ కాదు సైంటిస్ట్‌ అవుతాడు’ అనడంతో తరగతి మొత్తం బిగ్గరగా ఒకటే నవ్వులు. టెంపరో మండిబ్యులర్‌ జాయింట్‌ (టీఎంజే)కి బదులుగా.. కంగారులో నేను అలా చెప్పానని తర్వాత అర్థమైంది.
సీహెచ్‌ శ్రీకర్‌రెడ్డి, నంద్యాల


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని