సమస్యకు తెర దించుదాం

చేతిలో సెల్‌ఫోన్‌.. పనిలో కంప్యూటరో, ల్యాప్‌టాప్‌నో ఈ కాలం కుర్రాళ్లకు కామన్‌. వీటి వాడకం ఎక్కువైతే.. సరైన పద్ధతిలో వాడకపోతే ‘టెక్ట్స్‌ నెక్‌ సిండ్రోమ్‌’ తప్పదంటున్నారు నిపుణులు.

Published : 21 Oct 2023 00:03 IST

చేతిలో సెల్‌ఫోన్‌.. పనిలో కంప్యూటరో, ల్యాప్‌టాప్‌నో ఈ కాలం కుర్రాళ్లకు కామన్‌. వీటి వాడకం ఎక్కువైతే.. సరైన పద్ధతిలో వాడకపోతే ‘టెక్ట్స్‌ నెక్‌ సిండ్రోమ్‌’ తప్పదంటున్నారు నిపుణులు.

ఈ టెక్నాలజీ యుగంలో తెరల ముందు గంటలకొద్దీ గడపక తప్పడం లేదు. సెల్‌ఫోన్‌, ట్యాబ్‌, కంప్యూటర్‌...ఏదో ఒకటి ఉపయో గించాల్సిందే! ఈ క్రమంలో కూర్చునే భంగిమ సరిగా లేకపోతే.. మెడ, భుజాలు, వెన్నెముక.. నొప్పితో విలవిల్లాడిపోతుంటారు. 25 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్కులు 70శాతం మంది ఏదో ఒక సమయంలో ఈ ఇబ్బందిని ఎదుర్కొన్నవాళ్లేనని అధ్యయనాలు చెబుతున్నాయి. ఎందుకిలా అంటే.. మెడని ఫోన్లోకి తొంగి చూసేలా వంచితే ప్రభావం తీవ్రంగా ఉంటుంది. మెడని 15 డిగ్రీల కోణంలో ముందుకు వంచితే దాదాపు 12 కేజీల భారం పడితే.. 60 డిగ్రీల కోణంలో వంచి ఏకధాటిగా అలాగే చూస్తూ ఉంటే.. 25 కేజీల బరువు పడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. తీక్షణంగా, కన్నార్పకుండా తెరని చూడటం వల్ల మెడ నరాలు తీవ్రంగా అలసిపోతాయి. బిగుసుకుపోతాయి. దీంతో దీర్ఘకాలంలో వెన్నెముక సమస్యలు ఏర్పడతాయి. మెడనొప్పి సమస్యలూ వేధిస్తాయి. ఇలాంటి ఇబ్బందుల కారణంగా 13శాతం మంది చికిత్స తీసుకోవడమో, ఉద్యోగాలు వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఒక ఆన్‌లైన్‌ అధ్యయనంలో తేలింది.

ఇలా చేద్దాం

  • తలను కిందికి వంచి తెరల్ని తదేకంగా చూసే భంగిమ మార్చుకోవాలి. గ్యాడ్జెట్‌ తెరల్ని కళ్లకు సమాంతరంగా ఉండేలా చూసుకోవాలి.
  • కొందరు మెడను వంచి చెవికి ఆనించుకొని చాలాసేపు మాట్లాడుతుంటారు. ఇది కూడా ప్రమాదకరమే. దీర్ఘకాలంలో మెడ నరాలు దెబ్బతింటాయి. దీనికి బదులు హెడ్‌ఫోన్‌ లేదా ఫోన్‌ స్పీకర్‌ను ఉపయోగించడం ఉత్తమం.
  • సీట్లో కూర్చున్నప్పుడు తుంటి, మోకాళ్లు 90 డిగ్రీల కోణంలో ఉండేలా చూసుకోవాలి. కింద పాదాలు సమాంతరంగా ఉండాలి. వెన్నెముక ఛైర్‌ వెనకభాగం నిటారుగా ఉండాలి.
  • అరగంటకన్నా ఎక్కువసేపు తెరల్ని చూసినప్పుడు రెండు నిమిషాల పాటు బ్రేక్‌ ఇవ్వాలి. మెడను అటూఇటూ తిప్పాలి. కంటి రెప్పలను ఆడించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని