నీ పాటతో కరెంట్‌ షాక్‌..

నేను చదువులో టాపర్‌ని. స్పోర్ట్స్‌, క్విజ్‌, ఉపన్యాస పోటీల్లో బహుమతులన్నీ నాకే వచ్చేవి. పాటలు కూడా బాగా పాడతానని నా నమ్మకం. ఎప్పటికైనా కాలేజీ ఆడిటోరియంలో అందరి ముందూ పాడి శెభాష్‌ అనిపించుకోవాలని ఉండేది.

Published : 21 Oct 2023 00:05 IST

క్యాంపస్‌ కహానీ

నేను చదువులో టాపర్‌ని. స్పోర్ట్స్‌, క్విజ్‌, ఉపన్యాస పోటీల్లో బహుమతులన్నీ నాకే వచ్చేవి. పాటలు కూడా బాగా పాడతానని నా నమ్మకం. ఎప్పటికైనా కాలేజీ ఆడిటోరియంలో అందరి ముందూ పాడి శెభాష్‌ అనిపించుకోవాలని ఉండేది. ఆ అవకాశం ఫేర్‌వెల్‌ డే నాడు వచ్చింది. ఒకరోజు ముందే బాగా ప్రాక్టీస్‌ చేసి వెళ్లా. ‘మౌనంగానే ఎదగమనీ...’ పాట అందుకున్నా. సాంగ్‌ పూర్తవకముందే అందరూ చప్పట్లు కొట్టడం మొదలు పెట్టారు. నేను బాగా పాడటం లేదని అలా చేస్తున్నారా? అనే అనుమానం వచ్చింది. అయినా నాకు నాపై అతి నమ్మకం కదా.. అలాగే పూర్తి చేశాను. స్టేజీ దిగి, నా కుర్చీ దగ్గరికొచ్చేసరికి అక్కడ నాలుగైదు చీటీలున్నాయి. ఒకటి విప్పా. ‘ఎవరైనా రోడ్డు పక్కన గుండెనొప్పితో పడిపోతే వెంటనే వెళ్లి పాడవే. సీపీఆర్‌లు, కరెంట్‌ షాక్‌లు ఏమీ అక్కర్లేదు. దెబ్బకు లేచి నిల్చుంటాడు’ అది చదవగానే నా మొహం ఎరుపెక్కింది. నవ్వూ వచ్చింది. ఇంక జన్మలో మళ్లీ పాడాలనుకోలేదు.

షణ్మిత, ఈమెయిల్‌

(మీ కాలేజీ లైఫ్‌లో ఇలాంటి సరదా సంఘటనలు ఉంటే రాసి పంపండి. ప్రచురిస్తాం.)


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని