ఇది ప్రేమలు పుట్టే కాలం

పండగంటే నోరూరించే వంటకాలు.. పిల్లాపెద్దల సందళ్లు.. ఫ్యాషన్ల పరుగులు.. ఇవన్నీ మనకు తెలిసిందే. దీంతోపాటు ఫెస్టివల్‌ అంటే ప్రేమలో పడిపోయేందుకు ఓ అనువైన కాలం అనుకోవాల్సిందే.

Updated : 28 Oct 2023 03:43 IST

పండగంటే నోరూరించే వంటకాలు.. పిల్లాపెద్దల సందళ్లు.. ఫ్యాషన్ల పరుగులు.. ఇవన్నీ మనకు తెలిసిందే. దీంతోపాటు ఫెస్టివల్‌ అంటే ప్రేమలో పడిపోయేందుకు ఓ అనువైన కాలం అనుకోవాల్సిందే. బంబుల్‌ అనే డేటింగ్‌ యాప్‌ చేసిన అధ్యయనంలో 63శాతం మంది అమ్మాయిలు, అబ్బాయిలు ఇదే అభిప్రాయం వెలిబుచ్చారు మరి. వాళ్లు చెబుతున్న దాని ప్రకారం దసరా నవరాత్రి ఉత్సవాలు, దీపావళి, క్రిస్‌మస్‌.. ఇలాంటి పండగ రోజులు ఉత్సాహంగా జరుపుకోవడంతోపాటు.. మనసుకి నచ్చిన వారితో డేటింగ్‌ చేయడానికి అనువుగా ఉంటాయని యూత్‌ సెలవిచ్చారు. ఈ సమయంలో మేం ‘ఫెస్టివల్‌ డేటింగ్‌’కి సిద్ధంగా ఉంటామని చెప్పారు. ఇష్టమైనవారికి మనసులోని ప్రేమ వెల్లడించినప్పుడు.. డేటింగ్‌కి ఆహ్వానించినప్పుడు ఈ సమయంలో సానుకూలమైన ఫలితాలు వస్తాయని వాళ్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. మనసులు గెల్చుకోవడానికి బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం.. ఏకాంతంగా కలిసి గడపడంలాంటివి చేస్తామని చెప్పారు. మెట్రో నగ రాలతోపాటు మరో పది పట్టణాల్లో ఈ సర్వే నిర్వహించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని