ఇదేమైనా చేపల మార్కెట్టా?

నేను ఇంటర్‌లో ఉన్నప్పుడు జరిగిందిది. మా మ్యాథ్స్‌ లెక్చరర్‌ చాలా సౌమ్యుడు. ఎవరినీ పల్లెత్తు మాట అనరు. ఆయన రాగానే క్లాసంతా గోలగోలగా మారేది. ఎవరికి నచ్చినట్టు వాళ్లుండేవాళ్లు. ఆరోజు కూడా ఆయన పాఠం మొదలు పెట్టగానే ఎప్పట్లాగే అల్లరి మొదలైంది.

Published : 04 Nov 2023 00:02 IST

కాలేజీ కహానీలు

నేను ఇంటర్‌లో ఉన్నప్పుడు జరిగిందిది. మా మ్యాథ్స్‌ లెక్చరర్‌ చాలా సౌమ్యుడు. ఎవరినీ పల్లెత్తు మాట అనరు. ఆయన రాగానే క్లాసంతా గోలగోలగా మారేది. ఎవరికి నచ్చినట్టు వాళ్లుండేవాళ్లు. ఆరోజు కూడా ఆయన పాఠం మొదలు పెట్టగానే ఎప్పట్లాగే అల్లరి మొదలైంది. క్లాస్‌ శ్రద్ధగా వినాలనుకున్నా మా క్లాస్‌మేట్స్‌ గోలతో ఆ ప్రయత్నం విరమించుకున్నా. కాసేపయ్యాక అప్పట్లో బాగా ఫేమస్‌ అయిన ‘యే మేరా జహా.. యే మేరా ఘర్‌ మేరా ఆషియా..’ అనే పాట హమ్‌ చేయసాగా. నా ఫ్రెండ్స్‌ కూడా గట్టిగా గొంతు కలపడంతో సర్‌కి వినపడింది. ఎప్పుడూ లేనిది మాపై తిట్ల దండకం మొదలు పెట్టారు. ఆయనకి అది కొత్త కావడంతో.. తడబడసాగారు. దాంతో మాకు నవ్వాగలేదు. మా నవ్వు చూసి సర్‌ మరింత రెచ్చిపోయి ‘వెనక బెంచీలో కూర్చొని పాడటం కాదురా. ధైర్యముంటే స్టేజీ ఎక్కి పాడాలి’ అన్నారు. మేం వెంటనే బ్లాక్‌బోర్డు దగ్గరికెళ్లి నిల్చొని పాడసాగాం. మెల్లగా వేరేవాళ్లూ జతయ్యారు. ఇంక ఆయన కోపం పట్టలేక.. ‘వెళ్లండి వెధవల్లారా.. ఇది క్లాస్‌ అనుకున్నారా చేపల మార్కెటా?’ అని గట్టిగా అరవడంతో అందరం గప్‌చుప్‌గా ఎవరి సీట్లలో వాళ్లం వచ్చి కూర్చున్నాం. అప్పుడే బెల్‌ మోగింది. ఆయనటు వెళ్లిపోగానే.. క్లాసంతా పడీపడీ నవ్వాం.

అరుణ్‌ ఆర్‌, ఈమెయిల్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని