మ్యాక్స్‌వెల్‌ ఇన్నింగ్స్‌.. మనకేమి నేర్పుతోంది?

అఫ్గానిస్థాన్‌పై గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ ఆడిన ఇన్నింగ్స్‌.. అతడిని చరిత్ర పుటల్లోకి ఎక్కేలా చేసింది. ఎవరెస్ట్‌ శిఖరంపై కూర్చోబెట్టింది.

Updated : 11 Nov 2023 09:41 IST

అఫ్గానిస్థాన్‌పై గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ ఆడిన ఇన్నింగ్స్‌.. అతడిని చరిత్ర పుటల్లోకి ఎక్కేలా చేసింది. ఎవరెస్ట్‌ శిఖరంపై కూర్చోబెట్టింది. కఠినమైన పరిస్థితుల్లో అత్యంత విలువైన ఆట ఆడిన మ్యాక్సీ, అతడి ఇన్నింగ్స్‌ నుంచి మనమేం పాఠాలు నేర్చుకోవచ్చు అంటేే..

  • కొండంత లక్ష్యం. ఉన్నది ముగ్గురు టెయిలెండర్లే. ఈ పరిస్థితుల్లో ఆస్ట్రేలియా జట్టు ఇంకో 200 పరుగులు చేస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. కానీ ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాడు మ్యాక్స్‌వెల్‌. డబుల్‌ సెంచరీతో జట్టునే విజయతీరాలకు చేర్చాడు. ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమీ.. అనే అతడి నైజమే గెలుపు అందుకునేలా చేసింది. ‘లక్ష్యం దూరంగా ఉన్నా.. అది అసాధ్యం అని నేను భావించలేదు. ఆఖరికి ఫలితం దక్కింది’ అంటూ మ్యాచ్‌ తర్వాత వ్యాఖ్యానించాడు.
  •  మ్యాక్సీ కసిగా పోరాడుతున్నా.. మధ్యలోనే కండరాలు పట్టేశాయి. పరుగెత్తడం కాదు కదా.. కనీసం నడవలేని పరిస్థితి. ఓ పక్క బాధను పంటి బిగువున భరిస్తూనే.. సిక్సర్లు, ఫోర్లు బాదుతూ.. ముందుకెళ్లాడు. మనం లక్ష్యం చేరే మార్గంలోనూ ఇలాంటి ఆటంకాలు, సవాళ్లు, కష్టాలు పొంచి ఉంటాయి. వెనక్కి లాగుతుంటాయి. గమ్యం చేరాలంటే.. వాటిని ఎదురొడ్డాల్సిందే.
  • మ్యాక్స్‌ ఇన్నింగ్స్‌లో.. రిస్కీ షాట్్స ఉన్నాయి. సృజనాత్మక బ్యాటింగ్‌ ఉంది. స్కూప్‌ షాట్స్‌, రెండడుగులు ముందుకేసి బంతిని బలంగా బాదడం, బౌలర్‌ తల మీద నుంచి బౌండరీలు కొట్టడం.. ఇవి బౌలర్లపై చేయి సాధించడానికి, వారిని ఆత్మరక్షణలో పడేయడానికే. కొన్నిసార్లు మనం ఎంచుకున్న రంగంలో రిస్క్‌ తీసుకోవాల్సిందే. పోటీదారులను ఎదుర్కోవాలంటే ప్రయోగాలు చేయక తప్పదని సూచిస్తుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని