మన కోసం మరో బైక్‌

యంగిస్థాన్‌ల మనసు గెల్చుకోవడానికి మరో ఎలక్ట్రిక్‌ బండి విపణిలోకి రానుంది. అదే ఇటలీకి చెందిన ప్రముఖ వాహన తయారీ కంపెనీ లాంబ్రెట్టా రూపొందించిన ఎలెట్రా.

Published : 11 Nov 2023 00:48 IST

యంగిస్థాన్‌ల మనసు గెల్చుకోవడానికి మరో ఎలక్ట్రిక్‌ బండి విపణిలోకి రానుంది. అదే ఇటలీకి చెందిన ప్రముఖ వాహన తయారీ కంపెనీ లాంబ్రెట్టా రూపొందించిన ఎలెట్రా.

  • స్టైల్‌, డిజైన్‌కి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. స్టీల్‌ ఫ్రేమ్‌లు, హెక్సాగోనల్‌ ఎల్‌ఈడీ ల్యాంప్‌లు, డీఆర్‌ఎల్‌లు, విశాలమైన ఫ్లోర్‌బోర్డు, రెట్రో స్టైల్‌ సింగిల్‌ సీటు.. కొన్ని ఫీచర్లు.
  •  11కిలోవాట్ల ఎలక్ట్రిక్‌ మోటార్‌తో దూసుకెళ్తుంది. 4.6కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో వస్తోంది. అత్యధిక వేగం 110 కిలోమీటర్లు అంటోంది కంపెనీ. ఒక్కసారి పూర్తి ఛార్జింగ్‌ చేస్తే.. 127కి.మీ.లు ప్రయాణం చేయొచ్చు.
  •  ఎకో, రైడ్‌, స్పోర్ట్‌ అని మూడు రకాల మోడ్‌లు ఉన్నాయి. ప్రయాణించే దారులకు అనుగుణంగా వాటిని మార్చుకోవచ్చు.
  •  వచ్చే ఏడాది జూన్‌ వరకు ఈ టూవీలర్‌ని భారత్‌లో అందుబాటులోకి తీసుకొస్తామంటోంది తయారీదారు. ఈమధ్యే జరిగిన ఎడిషన్‌ ఆఫ్‌ మోటార్‌సైకిల్‌ అండ్‌ బైసికిల్‌ ఇండస్ట్రీ ఎగ్జిబిషన్‌ (ఈఐసీఎంఏ)-2023లో దీన్ని ప్రదర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని