మీ ప్రేమ భాషేంటి?

మాటలు మధురం: గుండెలో గూడుకట్టుకున్న ప్రేమను అవతలివాళ్లకు వ్యక్తం చేయడానికి అత్యధికులు ఆచరించే మార్గం ప్రేమ గాఢతను మాటల్లో చెప్పడమేనట

Updated : 18 Nov 2023 03:29 IST

ఆలుమగలైనా.. పడుచు ప్రేమికులైనా.. ఒకరిపై ఒకరికి ఉన్న ఇష్టాన్ని ఒక్కోరకంగా వ్యక్తపరుస్తుంటారు. మొత్తానికి ఈ వ్యక్తీకరణఐదు రకాలుగా ఉంటుందం టున్నారు లవ్‌గురూలు. ఇదిగో ఇలా..

  • మాటలు మధురం: గుండెలో గూడుకట్టుకున్న ప్రేమను అవతలివాళ్లకు వ్యక్తం చేయడానికి అత్యధికులు ఆచరించే మార్గం ప్రేమ గాఢతను మాటల్లో చెప్పడమేనట. ‘ఐలవ్యూ’, ‘నువ్వు అందంగా ఉన్నావు’, ‘నువ్వు నాకు దొరకడం ఎంతో లక్కీ’.. ఇలాంటివి ప్రేమ ఆయుష్షును మరింత పెంచుతాయంటున్నారు.
  •  విలువైన సమయం: మనసు పడ్డ వారికోసం సమయం కేటాయించడం కూడా ప్రేమను వ్యక్తపరచడంలో ఓ భాగమే. ఇద్దరూ కలిసి భోజనం చేయడం, సినిమాకి వెళ్లడం.. ఒకరి కోసం ఒకరు ఎదురుచూడటం.. ఆడుతుపాడుతూ పని చేయడం.. ఇవన్నీ ప్రేమకి సంకేతాలే.

  •  చేతలతో చేరువ: మాటలే కాదు.. ఒకరికొకరు సాయం చేసుకోవడమూ అనుబంధాన్ని దృఢం చేసుకునే మార్గమే. అర్ధాంగి కోసం వంట చేసి పెట్టడం.. ప్రేమికుడికి ప్రాజెక్ట్‌వర్క్‌లో సాయపడటం.. షాపింగ్‌ చేయడం.. ఇలాంటివి ఎంతో ప్రేమ ఉంటేగానీ.. చేయరుగా!
  •  బహుమతుల బంధం: నాలుగో ప్రేమ భాష మనసుకి నచ్చేవారు మెచ్చేలా బహుమతులు ఇవ్వడం. అవి మోముపై చిరునవ్వు కురిపించే చిరుకానుకలు కావొచ్చు.. జీవితాంతం గుర్తుంచుకునే విలువైన బహుమతులు అవ్వొచ్చు.. ఇలాంటివి భాగస్వాములను మెప్పిస్తూనే ఉంటాయట.
  •  సన్నిహితాల స్పర్శ: ఇష్టమైనవాళ్లని స్పృశించడం, కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం, చేతులో చేయి వేయడం, రొమాన్స్‌... ఇవి సైతం ప్రేమను వెల్లడించే దారులే. ముఖ్యంగా యువ జంటలు మరింత దగ్గరయ్యేందుకు ఇది షార్ట్‌కట్‌లా పని చేస్తుందంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని