భారత్‌ కప్పు కొట్టాలి.. మనం జంట కట్టాలి!

ప్రపంచకప్‌లో సత్తా చాటి.. జట్టుని గెలిపించాలని ప్రతి క్రికెటర్‌ ఉవ్విళ్లూరినట్టే.. మొదటిసారి నిన్ను చూసినప్పుడే నీ ప్రేమ పొందడానికి నేనూ అంతే సిద్ధమయ్యా.. భారత్‌ ఒక్కో మ్యాచ్‌ గెలుస్తూ టైటిల్‌కి దగ్గరవుతున్నట్టే.. నేనూ ఒక్కో అడుగూ ముందుకేస్తూ నీకు చేరువ కావాలని ప్రయత్నించా

Updated : 18 Nov 2023 03:29 IST

ప్రపంచకప్‌లో సత్తా చాటి.. జట్టుని గెలిపించాలని ప్రతి క్రికెటర్‌ ఉవ్విళ్లూరినట్టే.. మొదటిసారి నిన్ను చూసినప్పుడే నీ ప్రేమ పొందడానికి నేనూ అంతే సిద్ధమయ్యా.. భారత్‌ ఒక్కో మ్యాచ్‌ గెలుస్తూ టైటిల్‌కి దగ్గరవుతున్నట్టే.. నేనూ ఒక్కో అడుగూ ముందుకేస్తూ నీకు చేరువ కావాలని ప్రయత్నించా. కోహ్లి యాభయ్యో సెంచరీ కొట్టినప్పుడు అభిమానులు ఎంతలా పండగ చేసుకున్నారో.. నువ్వు నా ప్రపోజల్‌కి తలాడించినప్పుడు అంతే సంబరపడిపోయా. సెమీఫైనల్‌ మ్యాచ్‌లో మనవాళ్లు స్టేడియంలోకి అడుగుపెట్టగానే కరతాళ ధ్వనులు, కేరింతలు కొడుతూ ప్రేక్షకులు ఎంత ప్రోత్సహించారో.. అలాగే నా స్నేహితులు, సన్నిహితులు మనం ఏకం కావడానికి అంతగా ఆశీర్వదిస్తారని ఆశపడ్డా. ఆ మ్యాచ్‌లో భారత్‌ భారీ స్కోర్‌ చేసినా.. ఒకానొక సమయంలో ఓడిపోతామేమో అని ఏదో మూలన భయం వెంటాడినట్టు.. నువ్వు నా ప్రేమను అంగీకరించినా.. పెద్దలు ఎక్కడ అడ్డుపడతారో అని ఆందోళన చెందుతూనే ఉన్నా. ఆఖరికి కివీస్‌ని మట్టి కరిపించి భారత్‌ ఫైనల్‌కు దూసుకెళ్లినట్టే.. అన్ని అవాంతరాలనూ దాటుకొని మన ప్రేమ పెళ్లిపీటలెక్కుతుందని నమ్మకంతోనే ఉన్నా. ఆఖరి సమరంలో భారత్‌ ఆస్ట్రేలియానీ ఓడించి, ముచ్చటగా మూడోసారి కప్పుని సొంతం చేసుకోవాలని కోరుకుంటూనే.. ఆరోజే మనం మూడు ముళ్లు, ఏడడుగుల బంధంతో ముడిపడాలని ఉబలాటపడుతున్నా.
మనోజ్‌ గోపగాని
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని