తారల తలకట్టు..బజ్‌కట్‌

ఖరీదైన, అందమైన దుస్తులే కాదు.. తలపై జుట్టు సైతం ఓ కుర్రాడిని స్టైలిష్‌గా కనిపించేలా చేస్తుంది. ఈ సంగతి మన తారలు, స్టైలిష్ట్‌లకెరుకే. అందుకే జుట్టుతో ప్రయోగాలు చేస్తూ ఎప్పటికప్పుడు కొత్తగా కనిపిస్తుంటారు. ఒకరు హిట్‌ కొట్టగానే మిగతా కథానాయకులూ ఫాలోమంటారు.

Published : 02 Dec 2023 00:14 IST

ఖరీదైన, అందమైన దుస్తులే కాదు.. తలపై జుట్టు సైతం ఓ కుర్రాడిని స్టైలిష్‌గా కనిపించేలా చేస్తుంది. ఈ సంగతి మన తారలు, స్టైలిష్ట్‌లకెరుకే. అందుకే జుట్టుతో ప్రయోగాలు చేస్తూ ఎప్పటికప్పుడు కొత్తగా కనిపిస్తుంటారు. ఒకరు హిట్‌ కొట్టగానే మిగతా కథానాయకులూ ఫాలోమంటారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో బజ్‌కట్‌ స్టైల్‌ ట్రెండ్‌ జోరు మీదుంది. ఈమధ్యే ఒక ప్రముఖ చేతి గడియారాల బ్రాండ్‌ ప్రచారంలో అభిషేక్‌ బచ్చన్‌ ఈ లుక్‌తో సందడి చేశాడు. షాహిద్‌కపూర్‌ సైతం తన ‘కోయీ శక్‌’ సినిమాలో పాత్ర కోసం ఇదే తరహా స్టైల్‌ని అనుసరిస్తున్నాడు. స్టార్‌ హీరో సల్మాన్‌ఖాన్‌ సైతం కరణ్‌జోహార్‌తో చేస్తున్న సినిమా కోసం ఈ తీరుగా సిద్ధ మయ్యాడు. అన్నట్టు.. గతంలో ‘గజనీ’లో ఆమిర్‌ఖాన్‌, ‘ది గ్యాంగ్స్‌ ఆఫ్‌ వస్సేపూర్‌’ మనోజ్‌ బాజ్‌పేయీ ఇదే బజ్‌కట్‌ని అనుసరించి బాగా పాపులర్‌ చేశారు. ఇంతమంది హీరోలు ట్రెండ్‌ని సెట్‌ చేస్తే.. అభిమానులు మాత్రం ఆదరించకుండా ఉంటారా? చివరికంటూ నున్నగా కట్‌ చేసుకోవడమే ఈ బజ్‌కట్‌ స్పెషల్‌. కొందరైతే తమకు నచ్చినట్టుగా జుత్తు మధ్యలో ఓ గాటులా క్లీన్‌షేవ్‌ చేస్తుంటారు. ముఖ్యంగా పట్టణాలు, నగరాల్లో ఈ బజ్‌కట్‌తో కుర్రకారు చెలరేగిపోతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని