టూర్‌కి చలో!

లాంగ్‌టూర్లు, సాహసయాత్రలు ఈ కాలం కుర్రకారుకి కామన్‌. ఇలా ద్విచక్రవాహనాలపై జామ్మంటూ దూసుకెళ్లే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. అలాంటి ఔత్సాహికుల కోసమే మా ‘హిమాలయన్‌ 450’ అంటోంది రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌. తాజాగా దీనికే కొద్దిపాటి మార్పులు, చేర్పులు చేసి ‘న్యూ జనరేషన్‌ హిమాలయన్‌ మోటార్‌సైకిల్‌’గా తీసుకొస్తున్నారు. ప్రత్యేకతలివే.

Published : 02 Dec 2023 00:15 IST

ధర: రూ.2.69లక్షలు (ఎక్స్‌షోరూం, డిసెంబరు 31వరకే)

లాంగ్‌టూర్లు, సాహసయాత్రలు ఈ కాలం కుర్రకారుకి కామన్‌. ఇలా ద్విచక్రవాహనాలపై జామ్మంటూ దూసుకెళ్లే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. అలాంటి ఔత్సాహికుల కోసమే మా ‘హిమాలయన్‌ 450’ అంటోంది రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌. తాజాగా దీనికే కొద్దిపాటి మార్పులు, చేర్పులు చేసి ‘న్యూ జనరేషన్‌ హిమాలయన్‌ మోటార్‌సైకిల్‌’గా తీసుకొస్తున్నారు. ప్రత్యేకతలివే.

పవర్‌: 451.65సీసీ లిక్విడ్‌కూల్డ్‌ సింగిల్‌ సిలిండర్‌ ఇంజిన్‌తో పని చేస్తుంది. ఇది 8,000ఆర్‌పీఎం మీద 39.5బీహెచ్‌పీని ఉత్పత్తి చేస్తుంది. గత మోడల్‌తో పోల్చితే చెప్పుకోదగ్గ మార్పు ఏంటంటే.. స్లిప్‌ అండ్‌ అసిస్ట్‌ క్లచ్‌ని అదనంగా అమర్చారు. దీంతో ఎత్తుపల్లాల రోడ్లపై సైతం ప్రయాణం సాఫీగా ఉంటుందంటోంది తయారీదారు.

భద్రత: 320ఎంఎం, 270డిస్క్‌ బ్రేక్‌లకి తోడు రెండు చక్రాలకు యాంటీ లాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌ ఉండటంతో ఎంత వేగంలో అయినా బండి నియంత్రణలో ఉంటుంది. దృఢమైన టైర్లు దీని సొంతం.

ఫీచర్లు: నాలుగు అంగుళాల కలర్‌ డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌, బ్లూటూత్‌ కనెక్టివిటీ, ఎల్‌ఈడీ లైటింగ్‌ సిస్టమ్‌, విండ్‌షీల్డ్‌, అడ్జస్టబుల్‌ సీటు.. కొన్ని చెప్పుకోదగ్గ ఫీచర్లు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని