డయాగ్రామ్‌లు ఎక్కడ?

మా కెమిస్ట్రీ లెక్చరర్‌ చాలా స్ట్రిక్టు. ఓసారి మా ల్యాబ్‌ రికార్డులు పరిశీలిస్తున్నారు. అంతకుముందు పాఠం సరిగా అర్థం కాకపోవడంతో కొన్ని ఫార్ములాలు, డయాగ్రామ్‌లు సరిగా గీయలేకపోయాను. ‘సర్‌ అడిగితే చెప్పేదెలా..’ అని నాలో టెన్షన్‌ మొదలైంది. కాసేపు ఆలోచించాక నాకో ఉపాయం తట్టింది.

Published : 09 Dec 2023 00:15 IST

మా కెమిస్ట్రీ లెక్చరర్‌ చాలా స్ట్రిక్టు. ఓసారి మా ల్యాబ్‌ రికార్డులు పరిశీలిస్తున్నారు. అంతకుముందు పాఠం సరిగా అర్థం కాకపోవడంతో కొన్ని ఫార్ములాలు, డయాగ్రామ్‌లు సరిగా గీయలేకపోయాను. ‘సర్‌ అడిగితే చెప్పేదెలా..’ అని నాలో టెన్షన్‌ మొదలైంది. కాసేపు ఆలోచించాక నాకో ఉపాయం తట్టింది. ఆయన నా రికార్డులు పరిశీలిస్తున్నప్పుడు ధ్యాస మరల్చేలా ఏవో ప్రశ్నలడగాలనుకున్నా. నోట్‌బుక్‌ చూస్తున్నప్పుడు, అనుకున్నట్టుగానే ‘పరీక్షలు ఎప్పుడు మొదలవుతాయి సర్‌?’, ‘ప్రాక్టికల్‌కి ఎన్ని మార్కులు.. థియరీకి ఎన్ని?’ అంటూ ప్రశ్నలడుగుతూనే ఉన్నాను. ఆయన వాటికి సమాధానాలు చెబుతూ చూసీ చూడకుండా సంతకం చేసేశారు. ‘హమ్మయ్యా.. గండం గడిచిందనుకున్నా. కానీ నా వెనక బెంచీలో ఉండే రమేశ్‌ నన్ను ఇరికించాడు. ‘వాడి నోట్‌బుక్‌ చూసి ఇదేం పనిరా.. సగం సగం చేశావ్‌’ అంటూ వంగోబెట్టి వీపు మీద ఒక్కటిచ్చారు సర్‌. వాడు ఊరికే ఉండకుండా ‘శ్రీలేఖ నోట్‌బుక్‌ చూసే నేనూ రాశాను. తనది తప్పు కానప్పుడు నాదెలా అవుతుంది’ అన్నాడు రోషంగా. దాంతో సర్‌.. మరోసారి నా రికార్డులు పరిశీలించడంతో దొరికిపోయా. ఆయన గట్టిగా చీవాట్లు పెడుతుంటే క్లాసంతా నవ్వుల గోల.            

ఆర్‌.శ్రీలేఖ, కాకినాడ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని