బ్లాక్‌ లిస్ట్‌లో ఉన్నారా?

ఇన్‌స్టాగ్రామ్‌ వాడకుంటే అసలు యువతే కాదు అని చర్చించుకునే కాలమిది. ఇన్‌బాక్స్‌లో చర్చలు.. ఉద్దేశం చాటుకునే కామెంట్లు.. ఫొటోలు.. సరదాకి రీల్స్‌.. ఎన్నెన్నో ఆకర్షణలు అక్కడ.

Updated : 16 Dec 2023 11:10 IST

ఇన్‌స్టాగ్రామ్‌ వాడకుంటే అసలు యువతే కాదు అని చర్చించుకునే కాలమిది. ఇన్‌బాక్స్‌లో చర్చలు.. ఉద్దేశం చాటుకునే కామెంట్లు.. ఫొటోలు.. సరదాకి రీల్స్‌.. ఎన్నెన్నో ఆకర్షణలు అక్కడ. అయితే ఎన్ని పాజిటివ్స్‌ ఉన్నా.. ఒక్కోసారి మనం స్నేహితుల ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది. వాళ్లు మనల్ని బ్లాక్‌ లిస్టులో పెట్టేస్తుంటారు. అది తెలుసుకోవడం ఎలాగంటే..

ఇతర ఖాతా నుంచి: సాధారణంగా అయితే మనం ఒకరి ఖాతాలోని ఫొటోలు, వీడియోలు, రీల్స్‌ చూడగలుగుతాం. డైరెక్ట్‌ మెసేజ్‌లూ పంపగలుగుతాం. ఇవేమీ జరగడం లేదంటే.. అవతలివాళ్లు మిమ్మల్ని బ్లాక్‌ చేసినట్టే. ఇది తెలియాలంటే వేరే ఇతర ఫ్రెండ్‌ ఖాతా నుంచి పరిశీలించొచ్చు.

 వెబ్‌ ద్వారా: ప్రతి ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాకి ఒక ప్రత్యేకమైన ప్రొఫైల్‌ లింక్‌ ఉంటుంది. ప్రతి ఒక్కరికీ వేర్వేరు యూజర్‌ నేమ్‌ కనిపిస్తుంది. instagram.com/username యాప్‌లో కాకుండా.. వెబ్‌సైట్‌లో మీ ఖాతా తెరిచి, సెర్చ్‌బార్‌లో వాళ్ల ఖాతాను వెతకాలి. ‘సారీ దిస్‌ పేజ్‌ ఈజ్‌ నాట్‌ అవైలేబుల్‌’ అని కనిపిస్తే ఆ ఖాతా అందుబాటులో లేదు, లేదా మీరు బ్లాక్‌కి గురయ్యారు అని అర్థం. అదే లింక్‌ వేరే ఖాతాలో సెర్చ్‌ చేసినప్పుడు తెరుచుకుంటే మిమ్మల్ని బ్లాక్‌ చేశారని తేలిపోతుంది.
ట్యాగ్‌: మనల్ని బ్లాక్‌ చేసినవాళ్లని మన పోస్ట్‌లు, ఫొటోలకు ట్యాగ్‌ చేయలేం. సందేశాలూ పంపలేం. ఓసారి ఈ ప్రయత్నం చేసి చూస్తే బ్లాక్‌ లిస్ట్‌లో ఉన్నదీ, లేనిదీ తేలిపోతుంది.

ఫాలోయింగ్‌: వాళ్ల తాజా పోస్టులు ఏవీ మీకు కనిపించడం లేదంటే.. మిమ్మల్ని బ్లాక్‌ చేసినట్టే. మీరు వాళ్లని ఫాలో అవుతున్నా.. మరోసారి ఫాలోయింగ్‌ బటన్‌ నొక్కి చూడండి. మళ్లీ మీకు ‘ఫాలో’ ఆప్షన్‌ కనిపిస్తే.. బ్లాక్‌లో ఉన్నట్టే!.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని