ఈ ఏటి సూపర్

‘సూపర్‌’.. ఈ మాట వింటేనే కుర్రకారు ఒంటికి పూనకం వచ్చేస్తుంది. సూపర్‌ బైక్‌ అంటే ఇంకా చెప్పాలా? జీవితంలో ఒక్కసారైనా దాన్ని సొంతం చేసుకోవాలనుకుంటారు.

Updated : 23 Dec 2023 10:11 IST

‘సూపర్‌’.. ఈ మాట వింటేనే కుర్రకారు ఒంటికి పూనకం వచ్చేస్తుంది. సూపర్‌ బైక్‌ అంటే ఇంకా చెప్పాలా? జీవితంలో ఒక్కసారైనా దాన్ని సొంతం చేసుకోవాలనుకుంటారు. రయ్‌మని దూసుకెళ్లాలనుకుంటారు. అలా 2023లో యువత బాగా వెతికిన, ఆరా తీసిన, అమ్ముడైన సూపర్‌, మిడ్‌రేంజ్‌ ద్విచక్రవాహనాలివి.

  • ట్రయంఫ్‌ స్పీడ్‌ 400: ట్రయంఫ్‌ కంపెనీ ఈ మోడల్‌ని ప్రకటించినప్పటి నుంచి మన కుర్రకారు దీని కోసం విపరీతంగా ఎగబడ్డారు. గూగుల్‌లో అత్యధికంగా గాలించారు. 398సీసీ, సింగిల్‌ సిలిండర్‌, 39.5బీహెచ్‌పీ, 37.5ఎన్‌ఎం టార్క్‌.. దీనికి ప్రత్యేకతలు. లాంగ్‌టూర్లకు అనువైనది. గతుకుల రోడ్లలోనూ పరుగులు పెడుతుంది. ధర: రూ.2.80లక్షలు (ఎక్స్‌ షోరూం)
  • హీరో కరిజ్మా ఎక్స్‌ఎంఆర్‌: ‘కరిజ్మా’   మోడల్‌ విపణిలోకి వచ్చినప్పట్నుంచీ దీని ఛరిష్మా తగ్గట్లేదు. దానికే ఇంకొన్ని మెరుగులు దిద్దుకుని వచ్చిందే ‘కరిజ్మా ఎక్స్‌ఎంఆర్‌’. 210సీసీ లిక్విడ్‌ కూల్‌ ఇంజిన్‌తో పని చేస్తుంది. 25.1బీహెచ్‌పీ, 20.4ఎన్‌ఎం టార్క్‌ శక్తి దీని సొంతం. తన స్టైలిష్‌ లుక్‌తో ఈ ఏడాది సైతం కుర్రకారుకి తెగ నచ్చేసింది.ధర రూ.1.73లక్షలు.

  •  ఏప్రిలియా ఆర్‌ఎస్‌ 457: గత నెలలో ఇండియా బైక్‌ వీక్‌ ప్రదర్శించారు. ఆకట్టుకునే రూపం, పవర్‌తో షో స్టాపర్‌గా నిలిచింది. 457సీసీ లిక్విడ్‌కూల్డ్‌ ట్విన్‌ ఇంజిన్‌.. 46బీహెచ్‌పీ, 43.5ఎన్‌ఎం టార్క్‌.. శక్తి దీని ప్రత్యేకతలు. ధర రూ.4.10 లక్షలు (ఎక్స్‌షోరూం)
  •  రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ సూపర్‌ మెటియోర్‌ 650: సరసమైన ధరలో సూపర్‌ బైక్‌ కావాలి అనుకున్న కుర్రకారు ఎంపిక చేసుకుంది ఈ ద్విచక్రవాహనాన్నే. 650సీసీ లిక్విడ్‌ కూల్డ్‌ ఇంజిన్‌, 46.3బీహెచ్‌పీ 52.3ఎన్‌ఎం టార్క్‌.. ఈ సాంకేతికాంశాలు దీని పవరేంటో చెప్పకనే చెబుతున్నాయి.
  •  టీవీఎస్‌ అపాచీ ఆర్‌టీఆర్‌ 310: మిడ్‌ రేంజ్‌ విభాగంలో కుర్రకారు మనసు దోచిన బైక్‌లలో ఇదొకటి. రూ.2.43 లక్షల (ఎక్స్‌ షోరూం) ధరలో అందుబాటులో ఉంది. నేక్డ్‌ బైక్‌ విభాగంలో అత్యధికంగా అమ్ముడవుతోంది. 312సీసీ లిక్విడ్‌ కూల్డ్‌ ఇంజిన్‌, 35బీహెచ్‌పీ, 28.7ఎన్‌ఎం టార్క్‌ దీని సాంకేతికాంశాలు.
  •  వీటితోపాటు హార్లీ డేవిడ్‌సన్‌ ఎక్స్‌440, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ హిమాలయర్‌ 450, ట్రయంఫ్‌ స్పీడ్‌ 400, ట్రయంఫ్‌ స్క్రాంబ్లర్‌ 400ఎక్స్‌.. ఈ మోటార్‌సైకిళ్లపై కుర్రకారు బాగా ఇష్టం చూపించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని