క్లాసు నుంచి పారిపోయేంత సిగ్గు

ఒకరోజు మా ఇంటర్‌ గణితం వీక్లీ టెస్ట్‌ జరుగుతోంది. అందులో నేనసలే వీక్‌. పైగా ప్రశ్నాపత్రం చూస్తే.. అందులో ఒక్కటీ తెలిసిన సమాధానం లేదు. పక్క బెంచీలో ఉన్న నా స్నేహితుడిదీ అదే పరిస్థితి.

Published : 06 Jan 2024 00:04 IST

ఒకరోజు మా ఇంటర్‌ గణితం వీక్లీ టెస్ట్‌ జరుగుతోంది. అందులో నేనసలే వీక్‌. పైగా ప్రశ్నాపత్రం చూస్తే.. అందులో ఒక్కటీ తెలిసిన సమాధానం లేదు. పక్క బెంచీలో ఉన్న నా స్నేహితుడిదీ అదే పరిస్థితి. అతి కష్టమ్మీద ఏదో అరగంట రాసి ఇచ్చేశాం. బయటికెళ్దామనుకుంటే.. ‘హాలు బయట కూర్చోండి. పరీక్ష పూర్తయ్యేదాకా బయటికి వెళ్లడానికి వీల్లేదు’ అన్నారు మా లెక్చరర్‌. కాసేపు టెర్రస్‌పైన ఉందామని మెట్లు ఎక్కడానికి వెళ్తుంటే పీఈటీ సర్‌ కనిపించారు. ఆయనసలే కోపిష్టి. ఏమైనా అంటారేమో అనుకొని ఎడమవైపు మెట్లు దిగుతూ గాబరాలో కిందిదాకా వచ్చేశాం. అప్పుడే పక్క స్కూళ్లోని టెన్త్‌క్లాస్‌ విద్యార్థులంతా బయటికెళ్తూ కనిపించారు. వాళ్లలో కలిసి మెల్లగా మేమూ అక్కడ్నుంచి జారుకున్నాం. మమ్మల్ని ఎవరూ చూడలేదు అనుకున్నాంగానీ.. మర్నాడు తరగతికి రాగానే సర్‌ ‘పాపం చరణ్‌, కిషోర్‌లకు మ్యాథ్స్‌ అంటే చాలా భయం. ఎంత భయం అంటే.. ఎగ్జామ్‌ హాలు సమీపంలో కూడా ఉండలేనంత.. టెన్త్‌ క్లాస్‌ పిల్లలలతో కలిసి దూరంగా పారిపోయేంత’ అనడంతో మా క్లాసులోని అంతా నవ్వారు. మాకు మాత్రం మహా సిగ్గుగా అనిపించింది.

ఆర్‌ కిశోర్‌, గోకవరం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని