ఉత్తమ స్టార్టప్‌.. మీ చేతుల్లోనే

స్టార్టప్‌లు.. యువత కలల్ని మోసే ఆలోచనల అంకురాలే కాదు.. దేశ ప్రగతి శకటాలు కూడా. ఆలోచన సృజనాత్మకంగా ఉండి.. ఆచరణ సవ్యంగా సాగితే.. చిన్న పెట్టుబడితో మొదలైనవి సైతం యూనికార్న్‌లుగా మారతాయి

Published : 13 Jan 2024 10:10 IST

స్టార్టప్‌లు.. యువత కలల్ని మోసే ఆలోచనల అంకురాలే కాదు.. దేశ ప్రగతి శకటాలు కూడా. ఆలోచన సృజనాత్మకంగా ఉండి.. ఆచరణ సవ్యంగా సాగితే.. చిన్న పెట్టుబడితో మొదలైనవి సైతం యూనికార్న్‌లుగా మారతాయి. ఒకరిద్దరితో మొదలైన అంకురానికీ వేలమందికి ఉపాధి కల్పించేంత స్కోప్‌ ఉంటుంది. మరి ఆ స్థాయికి చేరే సత్తా ఏ స్టార్టప్‌కి ఉంది? వాటి భవిష్యత్తు ఏంటో మీరు అంచనా వేయగలరా? అలాంటి వాటికి ఓటేసి ఉత్తమమైనవాటిని ఎంపిక చేయండి. మీదీ ఒక స్టార్టప్‌ అయితే.. ఆ వివరాలు ప్రపంచం ముందు ప్రదర్శనకు పెట్టి, పెట్టుబడుల సాయం కోరండి. ఈ అవకాశం కల్పించేలా ‘ఎంటర్‌ప్రెన్యూర్‌ స్టార్టప్‌ అవార్డ్స్‌ 2024’ పేరుతో ఓ కార్యక్రమం మొదలైంది. మీకున్న అవగాహనతో ‘యంగ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’, ‘వుమన్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌’, ‘స్టార్టప్‌ లీడర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’.. ఇలా పది విభాగాల్లో ఉత్తమమైన వాటిని ఎంపిక చేయొచ్చు. విజేతగా నిలవడానికి దరఖాస్తూ చేసుకోవచ్చు. మీ ఓటింగ్‌ ద్వారానే మార్చిలో విజేతల్ని ప్రకటిస్తారు. మీకు ఆసక్తి ఉంటే.. పూర్తి వివరాల కోసం https://www.entrepreneurindia.com/startup/  వెబ్‌సైట్‌ తెరవండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని