ఏ కవీ రాయని మహా కావ్యం... ప్రేమ!

ఏ కవీ రాయని మహా కావ్యం... ప్రేమ! ఏ గాయకుడూ పాడని మధుర గీతం... ప్రేమ!

Updated : 10 Feb 2024 05:14 IST

ఏ కవీ రాయని మహా కావ్యం... ప్రేమ! ఏ గాయకుడూ పాడని మధుర గీతం... ప్రేమ! రెండు హృదయాల్ని ఏకం చేసేది.. భిన్న ధ్రువాల్ని కలిపేది ఇదే ప్రేమ!! ప్రేమ మహత్తు తెలియాలంటే ఒక్కసారైనా ఆ ప్రేమలో పడాల్సిందే... ప్రేమ గమ్మత్తు ఆస్వాదించాలంటే.. దాని రసాస్వాదనల అనుభూతులకు లోనవ్వాల్సిందే... ప్రేమలో మునిగితే.. ఆమె కొంటెచూపులే అతడి కళ్లలో కోటి కాంతులవుతాయి... అతడి తలంపులే ఆమె పెదాలపై చిరునవ్వుల మెరుపులు పూయిస్తాయి... ప్రేమికులు తలచుకుంటే ఈ నేలకు, ఆ గగనానికి నిచ్చెన వేయగలరు... సమస్త సంతోషాల్ని తమ గుప్పిట్లో బంధించి.. వాటితో ఊరేగనూగలరు... ఇరువురూ ఒకరి సమక్షంలో మరొకరు ఉంటే.. సమస్త జగతినీ ప్రేమమయం చేయగలరు... సామాన్యుల్నీ అంతటి మహిమాన్వితులుగా మలిచే ప్రేమని వేడుకగా చేసుకునే సందర్భం ప్రేమికుల రోజు... స్వచ్ఛమైన ప్రేమను గుండెల్లో నింపుకొని.. సమాజాన్ని సంతోషాల్లో ముంచెత్తే ప్రేమికులకు ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని